లండన్ లో బాహుబలి సందడి... వైరల్

September 25, 2020

ఎపుడో మూడేళ్ల కిందటి సినిమా. ఇప్పటికీ దాని బజ్ కొనసాగుతూనే ఉంది. ‘బాహుబలి’ అనే పదం ఒక లాండ్ మార్క్ అయిపోయింది. ఆ రికార్డును మళ్లీ రాజమౌళే తిరగరాయాలి గాని వేరే బాలీవుడ్ వారి చేత కూడా కాదన్నంత రేంజికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాహుబలి బిగినింగ్ ప్రదర్శన జరిగింది. ఎపుడో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రదర్శనకు, చూసిని సినిమాకు మళ్లీ ఐదువేల మంది రావడం విశేషం. జపాన్ వంటి పలు దేశాల నుంచి ఈ సినిమా అభిమానులు లండన్ థియేటర్లో చూడటానికి రావడం మరో విశేషం.

ఈ హాల్లో బాహుబలి 1 ప్రదర్శనతో పాటు కీరవాణి లైవ్ షో కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి అదిరిపోయే స్పందన లభించింది. జనం ఉర్రూతలూగారు. విదేశీ అభిమానులు కూడా రాజమౌళితో పోటీ దిగడానికి ఎగబడ్డారు. చరిత్ర సృష్టించిన ఈ సినిమా మరోసారి తెలుగు వాడి గొప్పతనాన్ని, భారతీయుడి టాలెంటును ప్రపంచానికి చూపింది. ఆ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.