బీజేపీ సంచలనం! ఏపీ సమరంలో ఉండదట..

September 22, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీపై, మోడీపై గుస్సుగా ఉన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ అంటూ ఆ పార్టీని చీదరించుకుంటున్నారు ఏపీ జనం. ఈ నేపథ్యంలోనే అమిత్ షా, మోడీ ఏపీకి వచ్చినప్పుడు జనం పట్టించుకోలేదు కూడా. అయితే ఈ విషయాన్ని గమనించిన బీజేపీ ఏపీ ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావిస్తోందట. చరిత్రను పరిశీలిస్తే బీజేపీ ప్రభావం తొలి నుంచీ లేదని అర్థమవుతుంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని 1999, 2004 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. అయితే ప్రస్తుతం టీడీపీ పొత్తు తెగతెంపులు చేసుకోవడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఇక్కడ బీజేపీ వైఖరి కారణంగా ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది.

మరోవైపు నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఇచ్చిన హామీని టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ ప్రజలకు గుర్తు చేస్తూ మోడీపై గుదిబండలు వేస్తున్నారు. ఇలా బాబు.. మోదీపై యుద్ధం ప్రకటించడంతో సామాన్య జనంలో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. క్రమంగా రాష్ట్రంలో బీజేపీ బలహీనపడింది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి  టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీచేసిన కారుమంచి జయరాం కూడా ఈ కారణంగానే బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవడమే దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. యెలాంటి పరిస్థితుల మధ్య రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం తిరుపతిలో జరగనుంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగనున్న కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌, జాతీయ కార్యదర్శి మురళీధరన్‌ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. తిరుపతిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా జిల్లాలో పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగించాలనేది రాష్ట్ర నేతల ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే.. ఈ సమావేశంలో పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న వాతావరణం ఉంది కాబట్టి.. ఈ సారికి ఏపీలో పోటీ చేయకపోవడమే ఉత్తమం అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సారి ఏపీలో బీజేపీ పోటీ చేస్తే ఉన్న పరువు కూడా పోతుందని, కాబట్టి పోటీ చేయకపోవడమే మంచిదని అంటున్నారు విశ్లేషకులు.