బోస్టన్ కాదు... జగన్ బోగస్ రిపోర్ట్-చంద్ర బాబు 

September 21, 2020

బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ లో చెప్పిందంతా బోగస్...అన్నీ తప్పుల తడకలే..
ఇంటెన్షనల్ గా అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతో, ఇక్కడ అభివృద్ది చేయడం ఇష్టం లేక ఇలాంటి తప్పుడు రిపోర్ట్ లతో ప్రజల్లో అపోహలు పెంచాలనే తప్ప ఇంకోటి కాదు.
డిస్ట్రిబ్యూటెడ్ కేపిటల్ మోడల్ అట...2 ఆప్షన్లట...6 శాటిలైట్ కమిషనర్లట-అంతా బోగస్-ఒక ఫార్స్ గా మారింది వీళ్ల పాలన..
గ్రీన్ ఫీల్డ్ సిటి డెవలప్ మెంట్ పై చెప్పిందంతా తప్పే:
32 పైగా గ్రీన్ ఫీల్డ్ సిటిలు నిర్మిస్తే 2 తప్ప (చైనాలో షెంజెన్, ఇండియాలో నవీ ముంబై) అన్నీ విఫలం అయ్యాయని చెప్పారు.
1) మొనార్టో(ఆస్ట్రేలియా): అడిలైడ్ కు 160కిమీ దూరం. నీలాంటి తిక్కలాడే అక్కడ నుంచి ప్రభుత్వం మార్చడం వల్ల అది విఫలం అయ్యింది.
2) బ్లా సిటి ప్రాజెక్ట్(ఓమన్): 2007లో పిపిపి కింద ప్రారంభించింది అది..
3) షేక్ జయిద్ సిటి(ఈజిప్ట్): గ్రేటర్ కైరో కు అది శాటిలైట్ సిటి
4) కింగ్ సిటి(ఘనా): మైనింగ్ ప్రాంతంలో అర్బన్ ఎకానమి కోసం పెట్టింది అది
5) ఇన్నో పోలిస్(రష్యా): టెక్నాలజి కంపెనీలకు ఒక హబ్ గా దానిని తెచ్చారు. దానిని ఫెయిల్ అయ్యింది అంటారు.
6) కిలాంబ(లువాండా): అది సింపుల్ గా అర్బన్ మునిసిపాలిటి-పిపిపి కింద కట్టాలని మొదలెట్టారు.
7) ఎకోట్లాంటిక్(నైజీరియా): సముద్రాన్ని రిక్లయిన్ చేసి అక్కడ ఒక టెక్నాలజి హబ్ చైనీస్ పార్టనర్ షిప్ లో చేద్దామని అనుకున్నారు. అదొక హబ్ మాత్రమే
పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ది చేసిన హబ్ లు, అర్బన్ టౌన్ షిప్ లను గ్రీన్ సిటిలుగా చూపించి అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడాన్ని బట్టే ఈ బిసిజి రిపోర్ట్ చిత్తశుద్ది ఎంతో తెలుస్తోంది.
మిగిలిన నగరాల గురించి చెప్పేటప్పుడు చుట్టుపక్కల జనాభా కలిపి చెప్పినప్పుడు, అమరావతికి మాత్రం లక్షా 20వేల జనాభాగా చూపడం ప్రజలను పక్కదారి పట్టించడమే..
గుంటూరు, విజయవాడ కలిపి అమరావతి జనాభా ఎంత 20లక్షల పైనే ఉంటుంది. అదెందుకు చెప్పడం లేదు..?
ఇప్పటికే రాజధానులున్న దేశాలకు,రాజధాని లేని మన రాష్టానికి పోలికేంటి:
రిపోర్ట్ లో పేర్కొన్న 3 దేశాలకు సంబంధించి రాజధానులు ఏవైతే చెప్పారో అవన్నీ ఆల్రడీ ఆ దేశాలకు ఎగ్జిస్టెన్స్ కేపిటళ్లు ఉన్నాయి..
మనం మాట్లాడేది రాజధాని లేని రాష్ట్రం గురించి...
డొడోమా(టాంజానియా):  దారుసలామ్ రాజధాని ఉండగా, సెంట్రల్లీ లొకేటెడ్ గా డొడోమా నగరాన్ని అభివృద్ది చేశారు. జనాభా అంత రాలేదని అనడం పూర్తి గా తప్పు.. పిపిపిలో దానిని అభివృద్ది చేస్తోంది 2,500ఎకరాల్లోనే..అందులో కూడా 7లక్షల జనాభా వచ్చింది. అది వీళ్లు తక్కువగా అంటున్నారు. (మన రాజధాని 34వేల ఎకరాలు...)
జయవర్దన్ పురె కొట్టే(శ్రీలంక): శ్రీలంకకు ఆల్రడీ కేపిటల్ ఉంది. చారిత్రకంగా లంక రాజుల భవనాలు, బుద్దిస్ట్ మాన్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి చారిత్రక అంశాల ప్రాతిపదికన కేపిటల్ గా దానిని నోటిఫై చేశారే తప్ప ‘‘అది ఇంకా మున్సిపాలిటీనే..’’
పుత్రజయ(మలేసియా): ఆల్రడీ ఉన్న కేపిటల్ డెవలప్ మెంట్ లో ఉండగా ఇంకొకటి టేకప్ చేశారు.
ఇవన్నీ రాజధానులు ఉన్న దేశాలు. మనది రాజధాని లేని రాష్ట్రం. దానికీ దీనికీ పొంతనలేదు.
7 రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు ఇంకోచోట ఉన్నాయట-
ఇవే మాటలు 04.09.2014న అసెంబ్లీలో చర్చలో ఎందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు..? ఆ రోజు అమరావతిని ఎందుకని స్వాగతించారు..?
1937శ్రీబాగ్ ఒప్పందం, వివిధ చారిత్రక హామీలు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ సిఫారసులు చేశారట-అంటే వాటి ప్రకారం రిపోర్ట్ ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డే బిసిజికి పేపర్ లీక్ చేశారన్నమాట)
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అపాయింట్ మెంట్ జీవో బైటపెట్టండి ముందు..? బీసిజిని మీరేం అడిగారు..? వాళ్లేం ఇచ్చారు..? అమరావతి వద్దు ఇంకేదైనా సూచించండని మీరు బిసిజిని అడిగారా లేదా..? అన్నీ బైటకు వస్తాయి..
ఈ కమిటీలన్నీ కేవలం ముసుగులు మాత్రమే..అమరావతిలో రాజధాని ఉండదని అసెంబ్లీలో జగన్ చెప్పారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఇప్పుడా కమిటీలకు ర్యాంకులు ఇవ్వడం, ఆప్షన్లు చెప్పడం అంతా బోగస్సే..
శ్రీబాగ్ గురించి రెండేళ్లు పాదయాత్రలో ఎప్పుడైనా చెప్పారా..? మీ మేనిఫెస్టోలో చెప్పారా శ్రీబాగ్ గురించి..? (అదే మాట విలేకరులు అడిగితే మేనిఫెస్టోలో పెట్టనివి చేయకూడదని ఎక్కడైనా ఉందా అని అంబటి రాంబాబు వితండ వాదం చేస్తారు..)
దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా సగటున శాసన సభ, సచివాలయం, హైకోర్టు, హెచ్ వోడి కార్యాలయాలకు కలిపి 22-25లక్షల చదరపు అడుగుల కనస్ట్రక్షన్ ఏరియా ఉందట...అమరావతికి 55లక్షల చ.అ ప్రతిపాదించడం ఎందుకు అన్నారు..(తగ్గించండి దానిని మీరు కావాలంటే, 25లక్షల చ.అడుగులే కట్టండి. అంతేతప్ప ఇక్కడ కట్టింది కూడా వదిలేసి, అందరినీ రోడ్లపైకి నెట్టి వెళ్లిపోతాం అంటే మీ ఇష్టారాజ్యమా..? )
కర్ణాటక,మహారాష్ట్ర,హిమాచల్ ప్రదేశ్ లో శాసనసభ సమావేశాలు 2చోట్ల జరుగుతున్నాయి అన్నారు...మీరు 3చోట్ల జరపండి..? ఎవరు వద్దన్నారు..?
సెక్రటేరియట్ కు ఏడాదికి లక్షమంది వస్తారట-52% విన్నపాలు ఇవ్వడానికి, సీఎం సహాయనిధి కోసం 25%, సిఫార్సుల కోసం 20%, ఇతర పనుల కోసం 3% వస్తారట...
స్థానిక సమస్యలపై 34,400మంది, సంక్షేమశాఖ పనుల కోసం 26,600 మంది, వ్యవసాయ శాఖకు 8వేల మంది, పరిశ్రమలకు 22వేల మంది, విద్యాశాఖకు 8వేలు, పర్యాటక శాఖకు 3వేల మంది వస్తారట...(8నెలల క్రితం అమరావతికి వచ్చివుంటే తెలిసేది ఎంతమంది ప్రతిరోజూ టూరిస్టులు అమరావతి సెక్రటేరియట్ కు చూడటానికి వచ్చారో..)
అమరావతి అభివృద్ది హై రిస్క్ అట-విశాఖకు తరలిస్తే లో రిస్క్ అట-ఎవరికి వైసిపి కా..? జగన్ కా..ఆ రిస్క్..? 1,000 కిమీ 24గం ప్రయాణం జనానికి రిస్క్ కాదా..? దానిని గురించి ఎందుకని ఆలోచించరు..? రాయదుర్గం నుంచి విశాఖ వెళ్లాలా..? సుళ్లూరుపేట నుంచి విశాఖ వెళ్లాలా పనులకు..?
ప్రజలు సచివాలయానికి, హెచ్ వోడి కార్యాలయాలకు రావాల్సిన పనిలేదని వీళ్లు చెబుతున్నారు-ఇప్పుడు వచ్చేవాళ్లను కూడా రాకుండా చేయవచ్చట శాటిలైట్ కమిషనరేట్లు పెట్టి..(అంటే జనాన్ని రాకుండా చేసి వీళ్లిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చట)
(ఒకవైపు కనెక్ట్ ఏపి అంటారు-ఇంకోవైపు డిస్ కనెక్ట్ ఏపి చేస్తున్నారు-ఇదేం మతలబో అర్ధం కావడం లేదు.)
చెన్నై ఐఐటి నివేదిక అంశాలు కూడా ఈ రిపోర్ట్ లో వక్రీకరించారు. 40మీటర్లు పునాదులకు వెళ్లాలని, కరకట్టకు 5కిమీ దాకా నిర్మాణాలు చేపట్టకూడదని సూచించిందట...(హైదరాబాద్ కన్నా, చెన్నై కన్నా ఇక్కడ ఫౌండేషన్ ఖర్చు తక్కువ అని చెప్పింది)
కర్నూలు మునిగిపోలేదా 2009 వరదల్లో...మంత్రాలయంలో ఎంతమంది చనిపోయారు..? విశాఖ ఏమైంది హుద్ హుద్ 200కిమీ వేగంతో పెనుగాలులకు వణికిపోలేదా...?భవనాల్లో ఇసుక మేటలు తొలగించడానికి ఎన్నిరోజులు పట్టింది..? (కర్నూలు రోడ్లపై మోకాళ్లలోతు బురద తొలగించడానికి 2009లో అప్పటి ప్రతిపక్షనేతగా నేనే వెళ్లా...)
మరి అమరావతిలో గత 60ఏళ్లలో ఆ పరిస్థితి వచ్చిందా..? 2009లో, 1953లో మునిగిందా..? గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్ అదే చెప్పింది కదా..
చైనాలో షెంజెన్, ఇండియాలో నవీ ముంబై తప్ప మిగిలిన గ్రీన్ ఫీల్డ్ సిటీలన్నీ విఫలం అయినట్లు తేల్చారు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపువాళ్లు..హాంకాంగ్ పక్కన షెంజెన్ ఉన్నందువల్ల, ముంబై పక్కన ఉండటం వల్లే నవీ ముంబై విజయవంతం అయ్యాయట..(మరి అమరావతి ఎక్కడ ఉంది, విజయవాడ-గుంటూరు మధ్యే ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది కదా..)
అమరావతి జనాభా 2025కు 15లక్షలు/20లక్షలు కావాలట- మొదటి 3ఏళ్లలో 7లక్షలు కావాలట-ఇప్పుడు లక్షా 20వేలే ఉందట...
అవన్నీ చుట్టుపక్కల నగరాల జనాభా కలిపిచెప్పి అమరావతికి మాత్రం విజయవాడ, గుంటూరు జనాభా కలిపి 20లక్షల పైగా అనెందుకు చెప్పలేదు..?
ఆప్షన్ 1కు రూ.4,645 కోట్లు అవుతుందట..ఆప్షన్ 2కు రూ.2,500 కోట్ల నుంచి రూ3,500 కోట్లు అవుతుందట( అమరావతిలో రూ.లక్షా 10వేల కోట్లు అవుతుందని ప్రజలను తప్పుదారి పట్టించడమే)
రూ.2.25 లక్షల కోట్ల అప్పులు ఉండగా, రూ.లక్షా 10వేల కోట్లతో ఒక నగరాన్ని అభివృద్ది చేయడం సమంజసమా..అంటున్నారు. (అప్పులకు, అమరావతి అభివృద్దికి ముడిపెట్టడం మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడమే..అప్పులు ఉన్నాయని హైదరాబాద్ అభివృద్దిని నేనుగాని, వాళ్ల నాయనగాని ఆపేశామా..? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు అప్పులు లేవా..?)
ఆ మొత్తాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్- రీజనబుల్ డిస్పారిటీస్ లేకుండా చేసి సస్టయినబుల్ డెవలప్ మెంట్ చేయాలట- పోలవరం, బొల్లాపల్లి రిజర్వాయర్, బనకచర్ల, ఉత్తరాంధ్ర, సీమ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తే వచ్చే ప్రయోజనం అధికం అంటారు.
(టిడిపి ప్రభుత్వం 5 ఏళ్లలో 23 ప్రాజెక్లుల నిర్మాణాన్ని పూర్తి చేసింది అమరావతి నగరాన్ని నిర్మిస్తూనే, దానికేం అంటారు..? ప్రాజెక్టులపై రూ.72వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతిపై రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టాం. మీరు అలాగే చేయండి, లేదా అమరావతిపై ఇంకా తగ్గించండి, ఉన్నవి వాడుకోండి.)
సింగపూర్ సిఏజిఆర్ 53 ఏళ్లలో 2% మాత్రమే పెరిగిందట-దుబాయ్ 40 ఏళ్లలో సిఏజిఆర్ 7% అట-సింగపూర్ 53ఏళ్ల తర్వాత 2% అట-హాంకాంగ్ 60 ఏళ్లలో 2% చేరిందట-అమరావతి 25ఏళ్లలో 15%-20% ఎలా పెరుగుతుందని అంటారు. (తలాతోకా లేకుండా మాట్లాడటం అంటే ఇదే)
అమరావతిని వ్యవసాయ కేంద్రంగా, విద్యా కేంద్రంగా అభివృద్ది చేస్తారట-అది వీళ్లు చేసేది ఏముంది..ఆల్రడీ అదేకదా..
వచ్చిన వాటినే తరిమేసి ఒక్కో ప్రాంతం ఒక్కో అంశంలో అభివృద్ది చేస్తారట-6ప్రాంతాల్లో అభివృద్ది చేసేవాళ్లయితే వీళ్లను తరిమేసేవాళ్లా..? విశాఖ నుంచి రూ.70వేల కోట్ల అదాని డేటా సెంటర్, లులూ, ప్రాంక్లిన్ టెంపుల్ టన్-తిరుపతి నుంచి రూ.15వేల కోట్ల రిలయన్స్-కర్నూలు నుంచి మెగా సీడ్ హబ్-ప్రకాశం జిల్లానుంచి రూ.25వేల కోట్ల పేపర్ పల్ప్ ఇండస్ట్రీ...)
విశాఖలో తప్ప మరెక్కడా అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు లేరట... పోర్టులు కూడా విశాఖ కంటే ఎక్కడా అభివృద్ది చెందలేదట(కృష్ణపట్నం పోర్టు వీళ్లకు కనబడలేదా..?)
ఉత్తరాంధ్రను మెడికల్ హబ్ గా చేయవచ్చట-ఈ గ్రూప్ చెబుతోంది-(మెడ్ టెక్ జోన్ ఎవరు తెచ్చారు విశాఖలో-దానిని ఏవిధంగా చేస్తున్నారో చూస్తున్నాం)
కాఫీ, పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు విశాఖ అనుకూలం అట-(అరకు కాఫీని ప్రమోట్ చేసిందెవరు..? రూ.550కోట్లతో విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల అభివృద్ది చేపట్టింది టిడిపి ప్రభుత్వం కాదా..?)
గోదావరి జిల్లాలలో వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్ అట- ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ప్రోత్సహించింది టిడిపి ప్రభుత్వం కాదా..? కాకినాడ-పుదుచ్చేరి వాటర్ వేస్ బకింగ్ హామ్ కెనాల్ మీదుగా చేపట్టింది మేము కాదా..?
కృష్ణా జిల్లా ఎడ్యుకేషన్ హబ్ చేయాలట-(విట్, ఎస్ ఆర్ ఎం, అమృత్  యూనివర్సిటీలు తెచ్చిందెవరు..?)
తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల అభివృద్ది సూచించింది ఈ గ్రూప్...? (టిడిపి ప్రభుత్వం తెచ్చిన రిలయన్స్ కంపెనీని పోగొట్టారని కూడా చెప్పాల్సింది..మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా చేశాం. 10ఫోన్లలో 3ఫోన్లు ఇక్కడే తయారీ)
అనంతపురం,కర్నూలు ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్ గా ఈ గ్రూప్ సూచించింది-(కియా తెచ్చిందెవరు..? హీరో తెచ్చిందెవరు..? )
నిన్న ఏలూరులో సీఎం మాట్లాడుతూ, ‘‘అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని అన్నారు. అన్నదమ్ముల్లా ఉండేలా ఈ పదవిని అందరి అభివృద్దికి ఉపయోగిస్తా’’ అన్నారు.

చెప్పేదొకటి చేసేదొకటి..ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ, కులాల చిచ్చు పెడుతూ ఇంత నటనా..?