చంద్రబాబు పేల్చిన ఐదు బుల్లెట్లు

September 25, 2020

పరిపాలన చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి, రాజకీయం జగన్ నుంచి నేర్చుకోవాలి అన్నట్టుంది ఏపీ పరిస్థితి. చంద్రబాబు ప్రతిదీ ప్రభుత్వం, ప్రజల కోసం వాడేసేవారు. జగన్ ప్రతిదీ తన పార్టీ కోసం, రాజకీయం కోసం వాడేస్తున్నారు. ఏపీలో తనకు తాను సెట్ చేసుకోవడం మినహా జగన్ ఆరు నెలల్లో సాధించింది ఏమీ లేదు. ముఖ్యంగా ఏపీకి గుండెకాయ వంటి నీటి ప్రాజెక్టులను.... ముఖ్యంగా పోలవరాన్ని పంతానికి పోయి పణంగా పెట్టాడు. పూర్వానుభవం తగినంతగా లేని కంపెనీ చేతిలో ఏపీ భవిష్యత్తు పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అస్తవ్యస్త పరిస్థితులపై, రాజధానిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ చేస్తున్న తప్పులను ఘాటుగా సూటిగా విమర్శించారు. 

జగన్ ఆలోచనా విధానం రాష్ట్రానికి చేటు అని... రాష్ట్రం తిరోగమనం వైపు నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ఐదు సూపర్ కామెంట్లు ఇవే. 

  1. జగన్ వి రివర్స్ టెండర్లు కాదు, రిజర్వు టెండర్లు.
  2. అమరావతిని చంపేశారు. వైఎస్ జగన్ లా ప్రవర్తించి ఉంటే... హైదరాబాదు ఉండేది కాదు
  3. కేవలం నా మార్కు చెరపాలనే అమరావతిని ఆపేశారు.
  4. పోలీసు వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించింది. నాకు డీజీపీ రూల్స్ చెబుతున్నారు. 
  5. హైదరాబాద్ గ్రౌండ్ సిటీ... అమరావతి గ్రీన్ సిటీ. 

జగన్ అసమర్థ పాలన వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నాపై ఉన్న నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్లను ఇచ్చిందని చంద్రబాబు  వ్యాఖ్యానించారు. మేము నాలుగేళ్లలో ఏపీ గ్రోత్ రేటును 11 శాతం పెంచితే... జగన్ ఆర్నెల్లో కుప్పకూల్చారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పరిణితి జగన్ కి లేదు. గతంలో తాను చేసిన పనిని మిగతా ముఖ్యమంత్రులు కొనసాగించడం వల్ల హైదరాబాదుకు నేడు ఈ స్థాయి వచ్చింది. కానీ జగన్ తనపై కక్షను రాష్ట్రంపై తీర్చుకుంటున్నారన్నారు.