విశాఖ గురించి చెబితే రాజమండ్రిలో ఏం జరిగిందంటే...

September 22, 2020

ఉత్తరాంధ్ర ప్రజల సహృదయం మరోసారి నిరూపితమైందని చెప్పిన చంద్రబాబు, అమరావతిని చంపి రాజధాని మాకివ్వాల్సిన అవసరం లేదు అంటున్నారని, అమరావతే మా రాజధాని అని విశాఖ వాసులు భావిస్తున్నారు అని చంద్రబాబు రాజమండ్రిలో జరిగిన రాజధాని ర్యాలీలో చెప్పారు. అమరావతి పొట్టలు కొట్టి మా పొట్టలు నింపుకోవాలని విశాఖ ప్రజలు అనుకోవడం లేదని, వారు తమ నగరం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు గాని రాజధాని అవ్వాలని కోరుకోవడం లేదన్నారు. సకల సదుపాయాలు ఉన్న వైజాగ్ ను జగన్ వెళ్లి అభివృద్ధి చేస్తానంటున్నారని చెప్పిన విశాఖ వాసులు... వచ్చిన వెంటనే జగన్ తన స్వంత లాభం కోసం 2 పెద్ద కంపెనీలను తరిమేసిన విషయం విశాఖ ప్రజలు మరిచిపోరని అన్నారు.

వైసీపీ వారికి అపుడు చెప్పా, ఇపుడు చెబుతున్నా...  మీరు 151 మంది వచ్చినా నన్నేం చేయలేరు. అందరికీ సమాధానం చెబుతా. ఈ ఉద్యమాన్ని కూడా ఆపలేరు. అమరావతి రైతులు అక్కడ శాశ్వతం. వారిని బెదిరిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ తాత్కాలికం. అతను రెండేళ్ల తర్వాత కనిపించడు. అందుకే హెచ్చరిస్తున్నాను. మీరు లాఠీలతో, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపే మూర్ఖ ప్రయత్నం చేయకండి. అది ఎప్పటికీ నెరవేరదు. ప్రాణాలయినా కోల్పోవడానికి సిద్ధపడుతున్నారు గాని రాజధాని కోల్పోవడానికి అమరావతి రైతులు ఒప్పుకోవడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

విశాఖ ప్రజల గురించి చంద్రబాబు రాజమండ్రిలో మాట్లాడుతుంటే నినాదాలు హోరెత్తాయి. అందరూ ఈలలు వేస్తూ చంద్రబాబుకు మద్దతు పలికారు. ముఖ్యమంగా విశాఖ అమరావతినే కోరుకుంటుందని చెప్పినపుడు ప్రజల స్పందన అమోఘం.