రాజ‌ధానిపై టీడీపీ వ్యూహం ఫ‌లించిందిగా..!

September 24, 2020

ఏపీలో గ‌డిచిన వారం ప‌దిరోజులుగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో అ న్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను సంఘ‌టితం చేయ‌డంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌క్సెస్ అయింద‌నే వ్యాఖ్య‌లు వి నిపిస్తున్నాయి. ఈ నెల 17న సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపా ద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. ఇత‌మిత్థంగా ఆయ‌న వెల్ల‌డించ‌క‌పోయినా.. రాజ‌ధానులు మూడు ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, విశాఖ‌లో పాల‌న రాజ‌ధానికి త‌మ ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంద‌ని చెప్పారు. అదేస‌మ యంలో క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని, అమ‌రావ‌తిలో స‌చివాల‌యం ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు.

దీనికి సంబంధించి జీఎన్ రావు క‌మిటీ ఇచ్చిన నివేదిక త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.అ యితే, అనూహ్యంగా ఈ క‌మిటీ కూడా పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌కు మొగ్గు చూప‌డంతో అమ‌రావ‌తిలో రాజ‌ధానిపై నీలి మేఘాలు క‌మ్ముకున్నాయి. నిజానికి ఇక్క‌డ నుంచి రాజ‌ధాని త‌ర‌లిపోతే.. అంటే పాల‌నా ప‌రంగా ఇక్కడ నుంచి ప్ర‌భుత్వం వేరే చోట ఏర్పాటైతే.. అమ‌రావ‌తి ఉనికికే ప్ర‌మాదం అనేది నిర్వివాదాంశం. కానీ, స‌చివాల‌యం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం చెప్పినా.. పెద్ద‌గా ఇక్క‌డ ప్ర‌యోజ‌నాలు ఉండే అవ‌కాశం లేదు. దీంతో గ‌త ప్ర‌భుత్వంలో టీడీపీ చేసిన నిర్ణ‌యాల‌పై జ‌గ‌న్ నిర్ణ‌యం గొడ్డ‌లిపెట్టుగా మారింది.

అమ‌రావ‌తి పోతే.. టీడీపీకి కూడా తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వు. దీనిని దృస్టిలో పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కావాలంటూ నిన‌దించారు. ఈ విష‌యంలో ఆయ‌న అన్ని ప‌క్షాల ను కూడ‌గ‌ట్టారు. అమ‌రావ‌తి ప్రాధాన్యాన్ని వివ‌రించారు. ఇక‌, రైతుల‌ను కూడా సంఘ‌టితంగా ఏక‌తాటిపై కి తెచ్చి ఉద్య‌మించేలా చేయ‌డంలోనూ చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. దీంతో వారం ప‌ది రోజులుగా రాజ ధాని గ్రామాల్లో నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు మార్మోగుతున్నాయి. వివిధ రూపాల్లో రైతులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధు లు కూడా ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు. మ‌రోప‌క్క‌, పార్టీ ప‌రంగా చూసుకున్నా.. చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏకాకులుగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ నాయ‌కులు టీడీపీకి బ్రాండ్ అయిన అమ‌రావతి విష‌యానికి వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు వెంట న‌డిచేందుకురెడీ అయ్యారు. ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌నే నినాదం వినిపిస్తూనే అమ‌రావ‌తిని అడ్ర‌స్ లేకుండా చేస్తామ‌నే ప్ర‌భుత్వ వైఖ‌రిని వారు ఎండ‌గ‌డుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ టీవీ చ‌ర్చ‌ల్లోనూ మీడియా స‌మావేశాల్లోనూ టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ అనుభ‌వించిన ప‌రాజ‌యం బాధ నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాబోయే రోజుల్లో ఈ ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్రం చేసేందుకు బాబు ఇప్ప‌టికే వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం.