​అమరావతిపై తోక ముడిచారు... అయినా జాగ్రత్త !!

September 22, 2020

అవగాహన రాహిత్యంతో, నాపై కోపంతో రాష్ట్రంపై అమరావతిని నాశనం చేసి, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల కంటే ఎవరూ గొప్పవాళ్లు కాదు. వైకాపా నేతలు అహంకారం అజ్జానంతో ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండేలా అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలకు సమాన దూరంలో ప్రజారాజధానిని ఉండాలని అమరావతిని ఎంచుకున్నాం. అది దేవ భూమి. ఇంద్రుడి రాజధాని కూడా అమరావతియే. ఇప్పటికీ లండన్ మ్యూజియంలో కూడా శాతవాహన కాలం నాటి అమరావతి చారిత్రక సాక్ష్యాలుంటాయి. 

చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న పేరును వైకాపా నేతలు అవమానిస్తున్నారు. ఒకరు ఎడారి అంటారు, ఇంకొకరు శ్మశానం అంటారు. డబ్బుల్లేవు కట్టలేం అంటారు. మీరు చెట్టు కింద కూర్చుని కేబినెట్ మీటింగులు పెట్టారా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెడుతున్నారు. ఎందుకు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. చరిత్రలోనే తొలిసారిగా ప్రజల భాగస్వామ్యంతో రూపాయి ఖర్చులేకుండా భూసమీకరణ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాం. ఇప్పటికే 9 వేల కోట్లు అక్కడ ఖర్చుపెట్టాం. చాలా భవనాలు చివరి దశలో ఉన్నాయి.  ఇంకో మూడు నాలుగు నెలల్లో అవి కూడా పూర్తయితే పాలనకు అవసరమైన అన్ని భవనాలు అధికారిక నివాసాలతో సహా అందుబాటులో ఉంటాయి. ఇపుడు వైజాగ్ తరలిస్తే... మళ్లీ ఇవన్నీ కట్టుకోవాలి. రాజధాని ఎందుకు తరలిస్తున్నారంటే... డ్రీమ్ కాపిటల్ కట్టాలంటే లక్ష 10 వేల కోట్లు కావాలి... అన్ని డబ్బుల్లేవు అంటారు. మరి డబ్బుల్లేని వారు వైజాగ్ లో మళ్లీ సచివాలయం, నివాసాలు అన్నీ కడతారా? దానికి డబ్బులు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు చంద్రబాబు.

 

అమరావతిని చంపడానికి ముందు నుంచి జగన్ ప్రయత్నిస్తున్నారు... అంటూ చంద్రబాబు వైసీపీ కుట్రలను వివరించారు.

1 తొలుత ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఉంది. ఒక వర్గం కోసం కట్టాలా అన్నారు. లేదు ఇక్కడ 75 శాతం వీకర్ సెక్షన్, 15 శాతం ఇతర కులాలు, 10 శాతానికి అటు ఇటుగా కమ్మ సామాజిక వర్గం ఉండొచ్చు అంటే ఇపుడు ఆ మాట అనడం మానేశారు.

2. తర్వాత ఇది ముంపు ప్రాంతం అన్నారు. వరద వస్తే మునిగిపోయే చోట రాజధాని కట్టాలా? అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ చాలా స్పస్టంగా చెప్పింది. అమరావతి ముంపు ప్రాంతం కాదు. 1957లో, 2009లో కృష్ణాకు చాలా పెద్ద వరదలు వచ్చాయి. అపుడు కూడా ఇది మునిగిపోలేదు అని చెప్పారు. మొన్నటి వరదల్లో కూడా ముంచాలని ట్రై చేసి విఫలమయ్యారు.

3. ఇన్ సైైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇక్కడ 80 శాతం రైతులు ఒకటి రెండు ఎకరాల వాళ్లే. మరి ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడుంది అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. 

4. ఇపుడు చివరగా డబ్బు లేదంటున్నారు. ఇది నెపం మాత్రమే.. అమరావతిలో పాలన చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఇపుడు ఉన్నాయి. ఇక వారు కట్టాల్సినవి ఏమీ మిగల్లేదు. సంపద సృష్టి చేతకకాకపోతే తర్వాత ప్రభుత్వాలు చేస్తాయి. అంతవరకు మీకు చేతనైనవి మీరు చేసుకోండి అని చంద్రబాబు పాయింట్ వైజ్ గా అమరావతి విషయంలో జగన్ యుటర్న్స్ లను చీల్చిచెండాడారు.

అమరావతి ఆర్థిక భారం అంటున్న వారు ముందు కళ్లు తెరవాలి. అసలు వీళ్లకు కాన్సెప్టే అర్థం కాలేదు. రైతులతో వివాద రహితంగా తీసుకున్న భూములు అభివృద్ధి చేసి పావు వంతు రైతులకు ఇస్తాం. మరో పావు వంతులో మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతుతాయి. కొంత భూమి ప్రభుత్వ కేటాయింపుల ద్వారా పెట్టుబడులకు ఇస్తుంది... ఇంకా 10 వేల ఎకరాలు ఉంటుంది. దాంతో వచ్చే డబ్బు, పర్యాటకం, వ్యాపారం ద్వారా వచ్చే పన్నులతో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించవచ్చు. 

రైతులకు, రాష్ట్ర యువతకు స్పష్టంగా చెబుతున్నాను. మనందరి నిరసనలకు, ధర్నాలకు, పోరాటాలకు భయపడి ప్రభుత్వం తోకముడిచింది. కానీ... ఇక్కడితో అయిపోేదు. అప్రమత్తంగా ఉండాలి. వీరివి ప్రమాదకరమైన ఆలోచనలు ఏమరపాటుగా ఉంటే భవిష్యత్తును తగలబెట్టేస్తారు అని చంద్రబాబు పిలుపునిచ్చారు.