అసెంబ్లీ సీన్ - ఇదే ప్రూఫ్, జగన్ సారీ చెబుతాడా?

September 24, 2020

టీడీపీ బలహీనతను వైసీపీ బాగా అర్థం చేసుకుంది. నిజానిజాలతో సంబంధం లేకుండా ఎడతెరిపిలేని దాడి చేయడం. దాన్ని తెలుగుదేశం కడుక్కునేలోపే మళ్లీ ఇంకోసారి బురద జల్లడం. మళ్లీ దాన్ని టీడీపీ కడుక్కోవడం. ఇలా వైసీపీ టీడీపీని పబ్లిసిటీతో అష్టదిగ్బంధనం చేస్తోంది. మేము నిజాయితీపరులం, మేము నిజాయితీపరులం అని చెప్పుకోవడానికి ఆధారాలు వెతుక్కోవడంలోనే టీడీపీకి పుణ్యకాలం గడిచిపోతుంది. అచ్చంగా చెప్పాలంటే తెలుగుదేశం జగన్ ట్రాప్ లో ఉంది. 

వడ్డీ లేని రుణాలపై చర్చ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని చెప్పేసింది. మేము ఇచ్చామని తెలుగుదేశం వాదించింది. ఆధారాలు తెస్తాను రాజీనామా చేస్తారా అని చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడిని జగన్ గద్దించారు. చూసేవాళ్లకి నిజంగా జగన్ చెప్పిందే నిజమేమో అన్నట్లుంది వాదన. కానీ అసెంబ్లీని వాయిదా వేడయంతో నిన్న టీడీపీ ప్రెస్ మీట్ పెట్టి...  ఆధారాలు చూపించింది. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలను ఇప్పించిందని చెప్పింది.

దీనిపై ఈరోజు మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. నిన్న సీఎం చాలా ఆవేశంగా అబద్దాలు చెప్పారు. కానీ, తాము ఇష్టానుసారంగా కాకుండా దస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. వడ్డీలేని రుణాలు చెల్లించామని ధ్రువీకరిస్తూ అధికారులు జారీ చేసిన లేఖలను సభలో చూపించారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న వడ్డీలను కూడా చెల్లించామని గుర్తు చేశారు. ‘నిన్న ముఖ్యమంత్రి నన్ను రాజీనామా చేయమని చెప్పారు. ఇప్పుడు నిజాలు చెప్పాం, వాటికి ఆధారాలు ఇచ్చాం. మరి ఇపుడు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? లేదా తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

అయితే, అడ్డంగా దొరికిపోయిన జగన్ దీనిని కవర్ చేసుకోవడానికి... ఐదు శాతం మందికి సాయం చేసి 95 శాతం అన్యాయం చేశారని టర్న్ తీసుకున్నారు. మొత్తానికి అలా అసెంబ్లీ వాగ్యుద్దాలతో నడుస్తోంది.