‘‘జగన్, నా మాట విను ఇది రాంగ్ మోడల్’’

September 25, 2020

జగన్ మొండిపట్టుతో ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందింది. మూడొంతల కంటే ఎక్కువ మెజారిటీ వైసీపీకి ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అయితే, దాదాపు నెలరోజులగా రైతులు తిండి నిద్ర సరిగా తీసుకోకుండా తాతల నాటి ఆస్తులు తమ కళ్ల ముందే నాశనం అవుతుంటే... ఏం చేయాలో దిక్కుతోచక రోడ్డెక్కి... కనిపించిన ప్రతిఒక్కరిని అయ్యా మా భూములు పోతున్నాయి. మాకు రాజధాని కావాలి అంటూ వేడుకుంటున్నారు. వారి దీనత చూసి ప్రతిఒక్కరికి కంటి నీరు వచ్చేస్తుంది. కేవలం ఒక్క జగన్ మాత్రమే వారి ఆవేదన చూసి చలించడం లేదు. 

5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం తలపెట్టిన రాజధాని... నా మీద కక్షతో ఆపవద్దంటూ జగన్ రెడ్డిని చంద్రబాబు పదేపదే కోరారు. అనుభవంతో చెబుతున్నాను. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. కేవలం తొలినాళ్లలోనే దానికి డబ్బులు పెట్టాలి. భవిష్యత్తులో అదే మనకు డబ్బులు తిరిగి ఇచ్చేస్థితికి త్వరలోనే వస్తుంది అంటూ చంద్రబాబు హెచ్చరించినా వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుుని వైసీపీ ప్రభుత్వం తన దారిన తాను పోతోంది. చివరకు ఈరోజు బిల్లు తెచ్చి సీఆర్డీఏను రద్దు చేసింది. వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకుంది. రైతుల ఉసురు పోసుకుంది. 33 వేల ఎకరాలు ఇచ్చిన 30 వేల మంది రైతులు తీవ్ర వేదనతో ముఖ్యమంత్రి జగన్ పై శాపాలు పెడుతున్నారు.   

వారి ఆవేదన చూడలేకపోయిన చంద్రబాబు వారి తరఫున జగన్ కు దండం పెట్టారు. తన కన్నా చిన్నవాడు అయిన జగన్ ను బతిమాలుకున్నారు. చంద్రబాబు ఏమన్నారంటే...  

’’నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నాకంటే చిన్నవాడివైనా. రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. ఆలోచించండి. తొందర పడొద్దండి. ఇది మంచిది కాదు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. ఎక్కడా జరగలేదు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది’’ అంటూ చంద్రబాబు నమస్కారం పెట్టి జగన్ ని అభ్యర్థించారు. బాబు రియాక్షన్ కు సామాన్యులు విస్మయం చెందారు. అసెంబ్లీలో ఇది అరుదైన దృశ్యంగా పేర్కొంటున్నారు.