జగన్ ఏం చేసుకుంటావో చేస్కో - చంద్రబాబు ఛాలెంజ్

September 22, 2020
CTYPE html>
ఇన్ సైడర్ ట్రేడింగ్ వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏమీ జరగలేదని... ఒకవేళ ప్రభుత్వానికి అనుమానం ఉంటే... వెంటనే దీనిపై విచారణ జరిపించి మాపై చర్యలు తీసుకోమని సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఒక్క తప్పు చేయలేదు. అందుకే ఒక్క రైతు కూడా మామీద కోర్టు కు పోలేదు. ఇపుడు నీ మీద శాపనార్థాలు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పు చేశారు కాబట్టి. 
మీరు అబద్ధాలు ప్రచారం చేయకుండా అయినా ఉండండి. మీరు చెబుతున్నట్లు మేము ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడి ఉంటే వెంటనే కోర్టులో కేసు వేసి మా తప్పుల్ని నిరూపించండి. అవగాహన లేదు. దొంగతెలివితేటలు తప్పు సరైన తెలివితేటలు లేవు. ఎదుటి వారి మీద బురద జల్లి లబ్ధి పొందాలనే మీ పిచ్చి ప్రయత్నాలు చెల్లవు. మీకు దమ్ముంటే మా మీద సీబీఐకి లేఖ రాయండి. అలాగే మీరు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి... కేసు త్వరగా తేల్చమని మీ కేసుల గురించి కూడా లేఖ రాయండి. మీ చేతనైంది చేసుకోండి అని చంద్రబాబు హెచ్చరించారు.
మరో కార్యక్రమంలో సుజనా చౌదరి మీడియాతో జగన్ ని హెచ్చరించారు. అమరావతిలో నాకు భూములున్నాయని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. బొత్సకు, సాయిరెడ్డికి, వైసీపీ గవర్నమెంటుకు అందరికీ ఛాలెంజ్ చేశాను. తోకముడిచారు. నా కు లాండ్ ఉంటే తెచ్చి చూపండి. అది మీకు ఇస్తాను. మీరు చెప్పిన పనిచేస్తా. ఏ శిక్షకు అయినా రెడీగా ఉంటే... అది అబద్ధం అయితే మీరు ఏం చేస్తారు? అని ప్రశ్నిస్తే... పారిపోయి మళ్లీ అబద్ధాలు మొరుగుతున్నారని సుజన చౌదరి విమర్శించారు.