కోరి క‌ష్టాలు తెచ్చుకుంటున్న రాహుల్‌

September 22, 2020

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్య‌వ‌హారం పార్టీలో క‌ల‌వ‌రం పెడుతుంది. ఆయ‌న తొంద‌ర ప‌డి చేస్తున్న వ్య‌ఖ్య‌లు రాజ‌కీయ దుమారాన్ని లేపుతున్న‌ప్ప‌టికి కొన్ని సంద‌ర్భాల్లో నాయ‌కుల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తున్నాయి. తాజాగా రాహుల్‌ ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. రఫేల్ యుద్దవిమానాల ఒప్పందం వివాదంలో రాహుల్ గాంధీ దూకుడుగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద మరియు ప్రధాని నరేంద్ర మోదీ మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రతి సభలోనూ చౌకీదార్ చోర్‌ హై (కాపలా వ్యక్తే దొంగగా మారాడు) అంటూ ప్రధాని మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు ముంబయిలోని సెక్యూరి సెక్యూరిటీ గార్డ్ అసోసియేషన్ ఆగ్రహానికి కారణమైంది. దానిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలని ఆ అసోసియేషన్ కోరిందని ముంబయి పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర రాజ్య సురక్షా రక్షక్‌ యూనియన్‌ దీనిపై ముంబయి లోని బాంద్రా-కుర్లా కాంప్లేక్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, సెక్యూరి సెక్యూరిటీ గార్డ్లల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ముంబయి పోలీసులు మీడియాకి తెలిపారు. కొద్ది రోజుల క్రితం ముంబయిలోని ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ మైదానంలో జరిగిన సభలో రాహుల్ గాంధి ప్రసంగింస్తూ చౌకీదార్ చోర్‌ హై(కాపలా వ్యక్తే దొంగగా మారాడు)అంటూ వ్యాఖ్యలు చేశారని దానిలో వెల్లడించారు. కాపలాదారులను అవమానపరిచే విధంగా ఉన్న ఇలాంటి నినాదాలు చేయకుండా అడ్డుకోవాలని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని ఆ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల కొన్ని వ‌ర్గాల ఓట్లు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని కాంగ్రెస్ నేతలు బ‌య‌ప‌డుతున్నారు.