పీకేపై భారీ పంచ్ వేశాడు 

September 24, 2020
CTYPE html>
కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీకి దగ్గరగా జరిగిన జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహార సరళిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో దోస్తానా... పవన్ కు ఏ మేరకు మేలు చేస్తుందన్న వాదనలుఒక వైపు... పవన్ ను దగ్గరకు తీయడం ద్వారా బీజేపీకి ఒనగూడే లాభాలేమిటన్న దానిపై మరోవైపు చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ అంశాలు ఎలా ఉన్నా... బీజేపీ దోప్తానాతో పవన్ కు లెఫ్ట్ పార్టీలు దాదాపుగా దూరమైపోయాయి. వామపక్షాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న సీపీఐ ఇప్పటికే జనసేనకు దూరం జరగగా... మరో కీలక పార్టీ సీపీఎం కూడా సీపీఐ బాటలోనే పవన్ కు దూరంగా జరిగే దిశగా యోచిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరి మాటను లెక్క చేయకుండా బీజేపీ పంచన చేరిపోయేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న పవన్ పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. చెగువేరా ఆదర్శమని చెప్పుకునే పవన్... బీజేపీ పంచన చేరిపోయి చెంగువీరగా మారిపోయారని ఆయన తనదైన శైలి విమర్శలు గుప్పించారు. 
బీజేపీతో పొత్తు దిశగా సాగుతున్న పవన్... సోమవారం విజయవాడలో బీజేపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా... కలిసే పోటీ చేయాలని కూడా ఇరు పార్టీలు నిర్ణయించినట్లుగా సమాచారం. అంతేకాకుండా 2024 ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కూడా బీజేపీ నేతలు ప్రకటించారు. సరే... రెండు పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది గానీ... స్థిర చిత్తం అంటూ లేకుండా పార్ట్ టైం పొలిటీషియన్ గా ముద్ర వేయించుకున్న పవన్ తో బీజేపీ ఎంత కాలం కలిసి సాగుతుందో చూడాలన్న దిశగానూ ఆసక్తికర కామెంట్లు వినిపిస్తున్నాయి. 
బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన దరిమిలా... ఈ కీలక పరిణామంపై సీపీఐ రామకృష్ణ కాస్తంత ఘాటుగానే స్పందించారు. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు రెండూ జనసేనతోనే కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. నాటి ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ బరిలోకి దిగిన మంగళగిరి స్థానాన్ని వామపక్షాలకు కేటాయించిన పవన్... టీడీపీతో లోపాయికారీ ఒప్పందం నేపథ్యంలో ఆ సీటును వెనక్కు లాగేసుకుని అక్కడ ఎవరినీ పోటీ పెట్టకుండా తనదైన శైలి మంత్రాంగం నెరిపారు. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రంపై విరుచుకుపడ్డ పవన్... ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించారు. ఈ అంశాలన్నింటినీ గుర్తు చేసిన రామకృష్ణ... పవన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నాడు తిట్టిన పార్టీతోనే ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయినా తనకు చేగువేరా ఆదర్శమని చెప్పుకునే పవన్... ఇప్పుడు బీజేపీ పంచన చేరిపోయి చెంగువీరగా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.