మోడీకి మండేలా మాట్లాడిన అసదుద్దీన్

September 24, 2020

సీఏఏ, ఎన్నార్సీ తో మోడీ హయాంలో తొలిసారి  మోడీపై ఇండియన్ ముస్లింలలో ఉద్యమ రూపంలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకయినా మంచిది అని అంతవరకు మోడీ నిర్ణయాలను ప్రశ్నించని ఇండియన్ ముస్లింలు ఈ బిల్లుతో గట్టిగా తమ వాయిస్ వినిపించడం మొదలుపెట్టారు. అయితే, కొందరు కుట్రపూరితంగా సీఏఏ గురించి అపోహలు, వదంతులు ప్రచారం చేస్తున్నారని... అది భారతీయ పౌరులకు వ్యతిరేకం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, అయోధ్య తీర్పు సమయంలో, కాశ్మీర్ పునర్వవస్తీకరణ సమయంలో కూడా ఏమీ మాట్లాడలేకపోయిన ముస్లింలు దీనిపై మాత్రం గట్టిగా తిరగబడ్డారు. అయితే... వీరి నిరసనలు పట్టించుకోకుండా మోడీ సర్కారు తాను చేయాల్సినది చేసుకుంటూ పోతోంది.

ఈ బిల్లు వల్ల తొలిసారి హైదరాబాదులోని పాత బస్తీలో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది. అంతకమునుపు ఏ రిపబ్లిక్ డే రోజున, ఏ స్వాతంత్ర దినోత్సవ రోజున ఈ జెండాను ముట్టుకోని వారు కూడా సీఏఏ దెబ్బకు ఆ జెండా భుజాన మోశారు. ఎన్నికల సమయంలో కంటే ఎక్కువ యాక్టివ్ ఎంఐఎం పార్టీ పనిచేసింది. ఇంకా దానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను కూడా అసుదుద్దీన్ వాడుకుంటున్నాడు.  ఈ ఎన్నికలు సీఏఏకి రెఫరెండం లాంటివని, బీజేపీ అభ్యర్థులను ఓడించి మోదీకి బుద్ధి చెప్పాలని అసద్  పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా గెలవకూడదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మాట కచ్చితంగా బీజేపీ పెద్దలకు కోపం తెప్పిస్తుందనడంలో ఏ సందేహం లేదు.  మరి  జనం అసద్ మాట వింటారా? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారా? అన్నది చూడాలి.