ఈ పిచ్చి ఆగదా సామీ...

September 26, 2020

హీరో విక్రమ్... అపరిచితుడు తీసినపుడు ... వీడిని ఇంక ఎవరు పట్టుకోలేరు. గొప్ప స్థాయికి వెళ్తాడు అనుకున్నారు. కానీ శివపుత్రుడు మొదలుకుని మొహానికి వేషాలు వేయడం వల్ల తనకు హిట్టొచ్చిందనుకుని అదే మూసలో వెళ్లిపోయి విక్రమ్ భారీ దెబ్బలు తిన్నాడు. దర్శకులు కూడా అలాంటి పాత్రలు గుర్తొచ్చినపుడు ఆయననే గుర్తుతెచ్చుకుంటారు. విక్రమ్ పిచ్చికి పరాకాష్ట ఐ సినిమా. ఆ సినిమా చూసి ఎంత మందికి వాంతులు అయ్యాయో. అయినా దర్శకులదేం పోయింది... కెరీర్ పోయేది విక్రమ్ దే కదా. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఈ వేషాల పిచ్చితో బాహుబలి రేంజ్ నటుడు అన్యాయం అయిపోయాడు అని అభిమానులు బాధపడుతుంటే మళ్లీ మరో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు విక్రమ్.

తాజాగా విక్రమ్ ఒకసినిమా ఓకే చేశారు. అందులో 25 గెటప్స్ లో కనిపిస్తున్నాడట. అజయ్ జ్జానముత్తు దర్శకుడు. తొలి షాటే విచిత్రమైన గెటప్ అట. ప్రపంచ సినీ చరిత్రలో ఒకే సినిమాలో ఏ హీరో ఇన్ని గెటప్పులు వేయలేదట. ఈ ప్రాజెక్టు వివరాలు ఇంకా బయటకు రాలేదు. 

అయినా దశావతారం సినిమా చూసినపుడే ... కమల్ హాసన్ ని తిట్టుకున్న జనాలు లేకపోలేదు. అలాంటిది విక్రమ్ తీసుకున్న నిర్ణయం.... సినిమా ఓపెనింగ్స్ కి పనికొస్తుందే మో గాని విక్రమ్ కెరీర్ ను తీర్చిదిద్దడానికి ఏం పనికిరాదు.