కేటీఆర్ ను భయపెట్టిన కూకట్పల్లి, అమీర్పేట్

September 27, 2020

కూకట్ పల్లి అమీర్ పేట్ కేటీఆర్ ను భయపెట్టడం ఏంటనుకుంటున్నారా... అవును. సామాజిక దూరం మెయింటెయిన్ చేయాలని దేశమంతా కోడై కూస్తుంటే వందలాది మంది కుకట్ పల్లి, అమీర్ పేట ప్రాంతంలో పోలీస్టేషన్ల ముందు ధర్నాలకు దిగారు. వీళ్లంతా ఎవరో తెలుసా? హాస్టల్ విద్యార్థులు. వీరిలో ఆంధ్రులే ఎక్కువ. హాస్టల్స్ మూసేయాలని ముందు సర్కారు భావించింది. దీంతో హాస్టల్స్ యజమానులు మొత్తం... ఖాళీ చేయమని విద్యార్థులకు చెప్పారు. దీంతో ఊరికెళ్లే మార్గం లేక, ఇక్కడ ఉండే అవకాశం లేక... ఏం చేయాలో తెలియని అమోయమ విద్యార్థులు పెద్ద ఎత్తున కేటీఆర్ కి ట్విట్టరులో రిక్వెస్టులు పెట్టారు. 

సాధారణంగా కేటీఆర్ ఏదైనా ట్విట్టరులో అడిగితే వేగంగా స్పందిస్తుంటారు. అందుకే తమ కష్టం ఆయనతో చెప్పుకుంటే తీరుస్తారని... నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ట్వీట్లు పెడుతున్నారు. మమ్మల్ని ఊరికి పంపండి. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశారు. కేటీఆర్ సర్కారుతో మాట్లాడి దీని గురించి నిర్ణయం తీసుకునే లోపే పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోలీస్ స్టేషన్లకు రావడంతో గుంపులుగా వారిని చూసి ఎక్కడ కరోనా ప్రబలుతుందో అని సర్కారు భయపడింది. 

అప్పటికపుడు కేటీఆర్ పోలీసులతో మాట్లాడారు. ఇంకా చర్చలు జరుగుతుండగానే ఈ జనం చూసి స్థానిక పోలీసులు అధికారులు సొంత వాహనాలు, లేదా అద్దె వాహనాలు ఉన్న వారికి ప్రత్యేక పాసులు ఇచ్చి పంపారు. అయితే... అందరికీ ఇవ్వలేకపోయారు. అంతమందికి పాసులు ఇవ్వడానికి వెంటనే సాధ్యం కాదని గ్రహించిన పోలీసులు గవర్నమెంటుతో మాట్లాడి హాస్టళ్లను కొనసాగించాలని రాత్రికి రాత్రి ఆర్డరు పాస్ చేశారు. ఏ హాస్టల్ మూసేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హాస్టల్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు తెలంగాణ పాసులు తీసుకుని సొంతూరికి బయలుదేరిన విద్యార్థులను ఏపీ పోలీసులు చెక్ పోస్టుల వద్ద అడ్డుకున్నారు. పాసులున్నా పంపేది లేదని తేల్చిచెప్పారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు సరిహద్దులో ఆగిపోయారు. వారికి తిండి తిప్పలు లేవు. ఇది పెద్ద గందరగోళానికి దారితీసింది. విచిత్రం ఏంటంటే... పోలీసులు ఇచ్చిన పాస్ చెల్లదని స్వయానా తెలంగాణ డీజీపీ చెప్పడం విశేషం. 

#photo: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు

Read Also

తెలంగాణలో ఆ ఊరికి వెళ్లకండి
వాళ్ల పాస్ పోర్టు రద్దు చేస్తాం... కేసీఆర్ వార్నింగ్
కేసీఆర్ సంచలన నిర్ణయం.. కాల్చేద్దామా?