క్రేజు తగ్గలేదు... పట్టు సడల లేదు

September 22, 2020

ఏపీ రాజకీయంలో మొన్నటి ఎన్నికల ఫలితాల్లో వచ్చింది తుపాను కాదు, సైక్లోను కాదు... టోర్నడో. కొత్త పార్టీకి తొలి అధికారం ఈ స్థాయిలో అందడంతో ఇక టీడీపీ అనేది ఉండదు, జనం కూడా అటువైపు చూడరని కొందరు విశ్లేషకులు స్టోరీలు అల్లారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బతికించే పార్టీ కాదు, ప్రజలు బతికించుకునే పార్టీ, ప్రజలు కోరుకునే పార్టీ అని బాబు తాజా ఉత్తరాంధ్ర పర్యటనలో తేలిపోయింది. 

ఎన్నికల సభ కంటే ఎక్కువగా జనసందోహంతో చంద్రబాబు పర్యటన ఆసాంతం కొనసాగింది. విజయసాయిరెడ్డి చెబుతున్నట్టు... టన్నుల కొద్దీ సంతోషం మోయలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే చంద్రబాబు చూడటానికి జనం ఇలా పోటెత్తుతారా? ఈ జనాన్ని కళ్లారా చూసిన వైసీపీ నేతలకు పంచెలు తడిసినంత పనయ్యింది. అరె... ఇక టీడీపీ పని అయిపోయిందనుకుంటే... ఈ స్థాయిలో పార్టీకి మద్దతు ఉందేమిటి అని ఉత్తరాంధ్ర వైసీపీలో గుబులు పుట్టింది. 

ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా... ప్రజలకు చంద్రబాబు ఒకటే ... అన్నట్టు తరలివచ్చిన జనంతో టీడీపీ శ్రేణులు ఉర్రూతలూగిపోయాయి. ఆ జనాన్ని చూసి చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తంచేశారు. కొసమెరుపు ఏంటంటే... చంద్రబాబు ఇన్ శ్రీకాకుళం అనేది ట్విట్టరు ఇండియా ట్రెండ్స్ లో నిలవడం హైలైట్. పర్యటన రెండో రోజు అద్భుతంగా సాగిపోయింది. వైసీపీకి కొరుకుడు పడనిది ఇదే. ఆ స్పందన గురించి మాటల కంటే...చిత్రాలే అద్భుతంగా చెప్పగలవు. కింది ఫొటోలు చూడండి.