ఇలియానా బ్రేకప్ స్టోరీ ఇదే !!

September 23, 2020

పీకల్లోతు ప్రేమలోనే కాదు.. ఆ విషయాన్ని దాచటానికి పెద్దగా ఇష్టపడని నటిగా ఇలియానాను చెప్పాలి. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నప్పుడు వీలైనంత గుట్టుగా ఉంచటం సెలబ్రిటీలకు మామూలే. అందుకు భిన్నంగా పని కట్టుకొని మరీ తాను ప్రేమించినోడి వివరాలు బయటకు పొక్కకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ తీసుకోలేదు ఇలియానా.
ఈ కారణంతోనే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ మీద మీడియాలో కథనాలు బోలెడన్ని వచ్చేశాయి. అంతేకాదు.. తామిద్దరం కలిసి ఉన్న విషయాన్ని బయటపడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ తీసుకోలేదు. చాలామంది ప్రముఖుల జీవితాల్లో మాదిరే.. ఇలియానా లవ్ స్టోరీలోనూ విసాదం తప్పలేదు. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయి విడిగా ఉంటోన్న ఇల్లీకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది.
ఇంతకీ ఇల్లీతో రిలేషన్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నాడన్న దానికి ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినీ నటిగా బిజీ లైఫ్ ను చూసిన ఇల్లీ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనుకుందట. అయితే.. ఇల్లీ డబ్బుతో ఎంజాయ్ చేసిన ఆమె బాయ్ ఫ్రెండ్ కు ఆమె సినిమాల్లో నటించకుండా ఉండటం అస్సలు నచ్చలేదట. ఇల్లీ సంపాదన ఆగిపోవటంతో.. ఆమెను సినిమాల్లో నటించాలంటూ ఒత్తిడి చేశాడట.
అయితే.. ఇలాంటివి ఊహించలేని ఇలియానాకు ఆండ్రూ తీరు నచ్చలేదని.. ఆ కారణంతోనే బ్రేకప్ చేసుకొందని చెబుతున్నారు. వాస్తవానికి రిలేషన్ స్టార్ట్ కావటానికి ముందే తాను పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని తేల్చి చెప్పిందని.. మొదట్లో బాగానే ఉన్నా ఆండ్రూ.. ఇల్లీ దగ్గర నుంచి డబ్బు సంపాదించటం ఆగిన నాటి నుంచి ఆమెపైన ఒత్తిడి తేవటంతో విసిగిపోయిన ఆమె.. అతడితో దూరం జరిగిందంటున్నారు. ఆండ్రూ వేధింపులతో అలిసిన ఇలియానా.. ప్రస్తుతానికి ఒంటరిగా ఉంటోంది. మరిప్పుడు ఆమె ఏం చేయనుందన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.