జగన్ కి లోకేష్ కంగ్రాట్స్

September 24, 2020

పవన్ కళ్యాణ్ ఫీల్డ్ లో జగన్ కి అడ్డం పడుతుంటే...  ట్విట్టరుతో లోకేష్ జగన్ ఇమేజీని డ్యామేజ్ చేస్తున్నారు. మాట్లాడటనంత వరకు ప్రతి వాడు తెలివైన వాడే అన్నట్టుంటుంది. జగన్ కూడా ఇంతకాలం ఎదుటి వారిని తిట్టడం తప్ప ఏ పాజిటివ్ మాటలు మాట్లాడిన సందర్భం లేదు. ఇపుడు అధికారంలోకి వచ్చాక... అన్నిరకాల బాధ్యతలు మోయాల్సి వస్తోంది, అన్ని మాటలు మాట్లాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తన అజ్జాన ప్రదర్శన అందరికీ తెలిసిపోయింది.

ఊర్లపేర్లు, పథకాల పేర్లు, తెలుగు పదాలు సరిగా పలకపోతున్నారు. లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఓ కఠినమైన తెలుగు పదాన్ని ఉచ్ఛరించలేని స్థితిలో ఉన్నారు. ఇంతవరకు ఏపీ సీఎంలలో ఎవరూ ఇలా లేరు. ఇదిలా ఉండగా... తాజాగా తన సాక్షి పేపరు ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఇన్నాళ్లు తెలుగుదేశం చేసిన ఆరోపణలను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ...

గారు నిండు సభలో సాక్షి పత్రికలో రాసే వార్తలు అన్ని అబద్ధాలే, అసత్యాలే అని ఒప్పుకున్నారు. ఇంత కాలం ప్రజల్ని దొంగ వార్తలతో బురిడీ కొట్టించిన సాక్షి పేపర్ ఒక దొంగ పేపర్ అని ఒప్పుకున్నందుకు జగన్ గారికి అభినందనలు తెలపకుండా ఉండలేకపోతున్నాను.  

ఇంతకాలం సాక్షి పేపరులో ప్రచురితమైన కథనాలు అన్నీ అబద్ధాలే అని జనాలకు ఇపుడు తెలిసివచ్చిందన్నారు. చినబాబు చిరుతిండి 25 లక్షలు, ఇక సన్నబియ్యం సరఫరా, డేటా చోర్ బాబు సర్కార్, నాలుగేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు, బాబు అవినీతి ఆకాశయానం ... వంటి అబద్ధాలు రాశారు అని... అవన్నీ అనంతర కాలంలో అబద్ధాలే అని తేలిపోయిందని అన్నారు. దీనిని ఇపుడు తాజాగా స్వయంగా ఒప్పుకున్నారని లోకేష్ అభినందించారు. 

కొసమెరుపు - ఏంటంటే... సాక్షి పత్రిక మాత్రమే కాదు, జగన్ కూడా తనకు నిజాలు తెలిసినా చెప్పరు. దానికి అతిపెద్ద ఉదాహరణ హెరిటేజ్ ఫ్రెష్. అది ఫ్యూచర్ గ్రూప్ వాళ్లది అని జగన్ కి తెలుసు. అయినా కూడా అదేపనిగా అది చంద్రబాబుది అని జగన్ ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మినహా మరి దేనికీ కాదు.