జగన్ సిగ్గుపడే వీడియో విడుదల చేసిన జనసేన

September 21, 2020

పాదయాత్రలో జనాల్ని నేరుగా కలిసిన వైసీపీ అధినేత జగన్ ఊరూరా ఎవరు ఏమడిగినా హామీ ఇచ్చేసి మా వాడే మేం చెప్పినవన్నీ విన్నాడన్న భ్రమ కల్పించారు. అయితే... అది భ్రమ అన్న విషయం అపుడు తెలియలేదు. ఆయన అధికారం చేపట్టాక తెలిసింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కీలక మైన నిర్ణయాల్లో మాట తప్పాడు. ఇటీవలి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఎన్నికల్లో పోటీచేసిన పవన్ కళ్యాణ్... తీవ్ర ఓటమిని చవిచూసినా కూడా రాజకీయాలకు దూరం కాలేదు. పైగా ప్రధాన ప్రతిపక్షంతో సమానంగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు.  ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రతి కీలక విషయంపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. 

నిన్నగాక మొన్న పింఛన్ల విషయంలో జగన్ ప్రజలను ఎలా మోసం చేసిందీ వివరిస్తూ పవన్ ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో తయారుచేసిన వీడియోను విడుదల చేశారు. జనసేన శతఘ్ని అక్కౌంట్లో  దీనిని పోస్టు చేశారు. రైతు సాయం, 45 ఏళ్లేక పింఛన్లు, అమ్మఒడి, సీపీఎస్ రద్దు... వంటి పలు హామీల్లో జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు అనే విషయాలు ఆ వీడియోలు ఉన్నాయి. దాదాపు వాటన్నిటిలో జగన్ మాట తప్పిన విషయం చూస్తూనే ఉన్నాం. ఈ వీడియోతో మరోసారి పవన్ జగన్ ను డిఫెన్సులో నెట్టారు. జనసేన పోస్టు చేసిన ఆ వీడియో మీరే చూడండి. 

ఇదీ లింకు: https://twitter.com/i/status/1206858576288874496