కియా ... దేశమంతటా ఆంధ్ర పరువు గోవిందా!!

September 21, 2020

ఈ రోజు ఇంటర్నెట్లో పేలిన బెస్ట్ జోక్ !

‘‘ఆల్రెడీ కియా సెల్టోస్ సెకండ్ హ్యాండ్ కారు కూడా మార్కెట్లో దొరుకుతుంటే... మళ్లీ హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ కోసం రీఓపెనింగా? !! ’’ 

దేన్నయినా ట్రోల్ చేయగలిగిన సోషల్ మీడియా నెట్ వర్క్ ఉన్న వైసీపీ బ్యాచ్ కూడా ఈ రోజు జగన్ కియా రీఓపెనింగును ఎలా సమర్థించాలో, ఎలా కవర్ చేయాలో తెలియక సైలెంటయ్యిపోయారు. టీడీపీ కార్యకర్తులు, సామాన్య నెటిజన్లు చేస్తున్న జగన్ ట్రోల్స్ పై ఫస్ట్ టైం వైసీపీ నెట్ వర్క్ నుంచి నో రియాక్షన్. దీనికి కారణం... కియా చంద్రబాబు హయాంలో శంకస్థాన, నిర్మాణం, ప్రారంభోత్సవం చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే... విదేశాల్లో ఒకటి రెండు చోట్ల కియా షోరూంలు మూతపడటంతో మూతబడేదాన్ని మన అక్కౌంట్లో వేసుకోవడం ఎందుకుని కార్ లాంచింగ్ రోజు జగన్ అదేపనిగా ఢిల్లీ టూరును ఎక్స్ టెండ్ చేసుకుని అక్కడే ఉండిపోయారు. 

కట్ చేస్తే.. అమ్మకాల్లో కియా కారు రికార్డు సృష్టించింది. దేశంలో మంచి ఆదరణ పొందింది. దీంతో ఇది మన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ సర్కారు ప్రయత్నించి ప్రభుత్వ సహకారం పూర్తిగా అందిస్తాం... అని ఏదైనా కార్యక్రమం పెట్టమని చెప్పినట్లు తెలిసింది. అందుకే టోటల్ ప్లాంట్ ఓపెనింగ్ అనే సాకుతో ప్రారంభించి మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్న కియాను ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ మళ్లీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గతంలో వైసీపీ వాళ్లు కియాపై చేసిన కామెంట్లు చూద్దాం.

కామెంట్ 1

’’కియాను మోడీ ఇండియాకు తెచ్చాడు, చంద్రబాబుది సొంత డబ్బా‘‘ 

 -  ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్

కామెంట్ 2

’’కార్లు అమ్ముడుపోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతిపెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపురంలో ఏర్పాటవుతున్న ప్లాంటు సంగతేమిటో? కమిషన్ల కక్కుర్తితో కియా మోటార్స్ కు చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వంద మందికి మించి లేరు‘‘

-విజయసాయిరెడ్డి, వైసీపీ నెం.2

కామెంట్ 3

’’కియా కార్ల ఉత్పత్తికి ఇంకా ఏడాది పడుతుంది. ఎన్నికల్లో లబ్ది కోసం అనంతపురం కియా మోటార్స్ లో మొదటి కారు తయారయిందని చంద్రబాబు షో చేశారు. చెన్నై ప్లాంటు నుంచి తెచ్చిన విడిభాగాలతో అసెంబుల్ చేసిన కారు అది‘‘

- ఇది విజయసాయిరెడ్డి ఫిబ్రవరి 1న చేసిన కామెంట్. కానీ ఆయన కామెంట్ చేసిన ఆర్నెల్లకే కారు మార్కెట్లోకి వచ్చింది. అందరూ వాడుతున్నారు.