జగన్ ని అడ్డంగా బుక్ చేసిన చంద్రబాబు

September 24, 2020

హెరిటేజ్ ను అడ్డంపెట్టుకుని చంద్రబాబును బదనాం చేయాలని చూసిన వైసీపీ కి అసెంబ్లీలో పెద్ద బ్యాండ్ వేశారు చంద్రబాబు. నిన్న అసెంబ్లీలో ఉల్లి ధరలపై వాదన జరిగింది. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లిని కిలో 200 అమ్ముతు చంద్రబాబు గవర్నమెంటును బదనాం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ... ముఖ్యమంత్రి గా ఉన్నవారు కూడా అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని... హెరిటేజ్ ను ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేసి చాలాకాలం అయ్యిందని చంద్రబాబు చెప్పారు. దీంతో నోట మాట రాలేదు. 

అయితే, మంత్రి కన్నబాబు ... మరోసారి వైసీపీని స్వయంగా బుక్ చేశారు.  హెరిటేజ్ తరఫున బ్రాహ్మణి మన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారికి హెరిటేజ్ ఫుడ్స్ తరఫున దీపావళి గిఫ్ట్ పంపారట. ఈ విషయాన్ని పుష్పశ్రీవాణి అసెంబ్లీలో చెబుతూ.... బయటకు హెరిటేజ్ మాది కాదు అంటారు. నాకు బ్రాహ్మణి గిఫ్ట్ పంపింది అని అన్నారు. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో స్పందించిన చంద్రబాబు... వైసీపీ వాళ్లు ముందు తెలుసుకుని మాట్లాడండి అంటూ చురకలు వేశారు. హెరిటేజ్ ఫుడ్స్ అనే కంపెనీ వేరు. హెరిటేజ్ ఫ్రెష్ అనే కంపెనీ వేరు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున బ్రహ్మణి ప్రముఖులకు దీపావళి కానుకలు పంపిన మాట నిజమే. అది మాదే.  కానీ హెరిటేజ్ ఫ్రెష్  ఫ్యూచర్ గ్రూప్ ది. రెండు వేర్వేరు కంపెనీలు అని చంద్రబాబు వివరించారు. 

నిజాలు తెలుసుకోకుండా ఎంతసేపు చంద్రబాబును ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశం తప్ప వేరేది ఏమీ కనపడటం లేదు చంద్రబాబు అసెంబ్లీలో కన్నబాబు, పుష్ప అనే ఇద్దరు మంత్రులు పరువును బజారున పడేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ ఏమో... బైక్ కి టోల్ గేట్ కడతారో లేదో తెలియని అజ్జాననంతో రాష్ట్రాన్ని పాలిస్తారు. వైసీపీ నేతలు ఏ వివరాలు ముందు ఉంచుకోకుండానే అడ్డంగా వాదించి అంతే అడ్డంగా బుక్ అవుతారు.