అరె... పవన్ కూడానా?

September 22, 2020

ప్రభుత్వాలు ఏదైనా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కలిగే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నపుడు సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా కమిటీలు వేయడం పరిపాటి. అదే మునుపటి ముఖ్యమంత్రులు అందరూ చేశారు. తాజాగా తనకు నచ్చిన రాజధానిని పెట్టుకునే క్రమంలో జగన్ కూడా చేశారు. అయితే... ఈరోజు రాజధాని గురించి మీటింగ్ పెట్టుకున్న పవన్ అసలు దీని సంగతి చూడమంటూ... పార్టీ తరఫున ఓ కమిటీ వేశారు. 11 మంది నేతలతో ఏర్పాటైన ఈ కమిటీ బాధ్యత రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం సానుకూల ప్రతికూల ప్రభావాలు అంచనా వేయడం, అమరావతిపై అధ్యయనం చేయడం, రైతులను కాపాడటం. ప్రభుత్వమే కమిటీలు వేయాలా? మేము వేయకూడదా అన్నటుంది జనసేనాని కథ. అయినంత మాత్రాన పవన్ తీసుకున్న నిర్ణయం ఏమీ తప్పు నిర్ణయం కాదు. సరైనదే అని చెప్పాలి. కూలంకుషంగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడటం కూడా మంచిదే. ఈరోజు పార్టీ నేతలతో మంగళగిరి ఆఫీసులో పెద్ద మీటింగ్ పెట్టుకున్న పవన్ చివరకు కమిటీ వేయడంతో ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తోందని పవన్ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ పెట్టామన్నది అన్న పాయింట్ కంటే కూడా ఎక్కడ పెట్టినా అన్నీ ఒకేచోట పెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని జనసేనాని తాత్కాలిక కంక్లూజన్ ఇచ్చారు. మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి కానీ రైతులకు అన్యాయం చేయొద్దు, చేస్తే ఊరుకోం అని పవన్ హెచ్చరించారు. పాలన ఒకేచోట నుంచి జరగాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు రావాలన్నది తమ పార్టీ సిద్ధంగా పవన్ పేర్కొన్నారు. రాజధానిపై స్పష్టత ఇచ్చి రైతులకు పూర్తి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. 

కింద వీడియోలో పవన్ పూర్తి ప్రసంగం వినొచ్చు