జగన్ తానే తెలివైన వాడిని అనుకుంటున్నారు: జేసీ దివాకర్ రెడ్డి

September 23, 2020

ఎపుడు మా వాడు, మావాడు అనుకుంటూ జగన్ ని అంటూ ఉండే జేసీ దివాకర్ రెడ్డిగా వరుస వేధింపులతో బాగా కాలింది. అందుకే ఈసారి మా వాడు అనకుండా మాట్లాడాడు. అంతేకాదు, వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్ తానే తెలివైన వాడిని అని, తాను చేసేవే తెలివైన పనులు అని అనుకుంటున్నాడని ... జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలా వేషాలు వేస్తే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమిస్తాం అని జేసీ హెచ్చరించారు.

విషయంలో సీరియస్ నెస్ లేకుండా ఎపుడూ జేసీ కామెంట్లు చేయడు. జేసీ కామెంట్స్ చేశాడంటే అది వార్తలకు ఎక్కాల్సిందే. కొన్ని రోజులుగా జేసీ వ్యాపారాల మీద జగన్ తీవ్రంగా దాడి చేస్తున్నాడు. అయితే... ట్రావెల్స్ విషయంలో అందరినీ వదిలేసి కేవలం జేసీని మాత్రమే టార్గెట్ చేశాడు జగన్. మొన్ననే పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జేసీ తాజాగే జగన్ కే వార్నింగ్ ఇచ్చారు. 

జగన్ తల నరికి ఇంకోచోట పెడతాను అంటున్నాడు. మొండెం తీసుకెళ్లి ఇంకోచోట పెడతాడట. తెలివితేటలు ఆయనకు మాత్రమే ఉన్నాయా? మిగతా ముఖ్యమంత్రులకు లేవా. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే పేరు రాదు. ఉద్యమం వస్తుంది అని జేసీ హెచ్చరించారు. అసలు అమరావతే చాలా దూరం ఎలా పోవాలి దేవుడా అనుకుంటుంటే... ఈయనొచ్చి వైజాగ్ కు రండి అంటున్నాడు. అదెక్కడో ఒక మూలనుంది. దాన్ని ఎలా చేరుకోవాలి అని జేసీ ప్రశ్నించారు.