కమల్, వినాయక్... పెద్ద మనసు

September 26, 2020

సాటి మనిషికి కష్టం వచ్చినపుడు దయచూపిన వాడే నిజమైన మనిషి. సాయం చేయడానికి మన వద్ద ఏం ఉంది అని కాదు.. అలాంటి మనసు ఉంటే చాలు మనకున్నదాంట్లో సాయం చేస్తాం. పలువురు కరోనా వల్ల ఏర్పడిన విపత్తుతో సాామాన్యులను ఆదుకోవడానికి తమ వంతు ఉదారత చూపుతున్నారు. నితిన్ రెండు రాష్ట్రాలకు 10 లక్షలు చొప్పున సాయం చేశారు. సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఏకంగా రెండు కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు సినిమా ప్రముఖులు తమ దాతృత్వం చూపారు.

కమల్ హాసన్ తన ఇంటిని ఆస్పత్రిగా వాడుకోండి అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇపుడు ఆయన సినిమా నటుడే కాదు, రాజకీయ పార్టీ నేత కూడా. కానీ ఏకంగా ఇంటినే ఆస్పత్రికి ఇస్తాను అన్నారంటే ఆయన దాతృత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేం. అంతేకాదు... పేద కళాకారులకు పది లక్షలు విరాళం కూడా ఇచ్చారు. ధనుష్ 15 లక్షలు, దర్శకుడు శంకర్ 10 లక్షలు ప్రకటించగా... రజనీకాంత్ తన స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు 50 లక్షలు ప్రకటించారు. విజయ్, శివకార్తికేయన్ కూడా పది లక్షలు ప్రకటించారు.

Read Also

సెక్సీ టాటూలతో కియారా రా లుక్
అమీ జాక్సన్ ... తల్లయ్యాక కూడా ఎక్స్ పోజింగే
ఆముదం తాగ‌మ‌న్న పూరి జ‌గ‌న్నాథ్