జగన్, కేసీఆర్ ఢిల్లీ టూరు... ప్రీ ప్లాన్డా?

September 25, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు రోజులు ఢిల్లీ టూరు... ప్రధానితో మీటింగ్. 

ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ టూరు... ప్రధానితో మీటింగ్.

మాటిమాటికి కలుసుకుని, తరచూ ఫోన్లో మాట్లాడుకునే ఈ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఢిల్లీ టూరు పెట్టుకుంటారా? తెలియకుండా ప్లాన్ చేశామని చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా నమ్ముతారా ? లేదు. వీరిద్దరు ఇటీవల కలిసినపుడే ఈ ఢిల్లీ టూరు ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక ప్రాజెక్టు కు జాతీయ హోదా తెప్పించడానికి, మిషన్ భగీరథను నేషనల్ ప్రాజెక్టులో విలీనం చేయడానికి తన పర్యటన అని సీఎం కేసీఆర్ ఆఫీసు చెబుతోంది. 15 వ తేదీని వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి హాజరు కమ్మని పిలవడానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టు ఏపీ సీఎం ఆఫీసు తెలిపింది. 

రైతులకు సాయం అనే పథకం దేశమంతటా మోడీ అమలుచేస్తున్నారు. తనే స్వయంగా 12500 ఇస్తానని చెప్పిన జగన్ ఆ మాట తప్పారు. మోడీ పథకాన్ని వాడుకుని ఆ మేరకు తన హామీని కోత పెట్టారు. అందుకే మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడని అంటున్నారు.

ఇది పక్కన పెడితే.. తాజాగా వినిపిస్తున్న విషయం ఏంటంటే... కేంద్రాన్ని వాడుకోవడంలో కేసీఆర్ మార్గదర్శనం ప్రకారమే జగన్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అడిగితే ఎలాగూ ఇవ్వకపోగా అనవసరంగా నువ్వు మోడీకి దూరం అవుతావు. అది మానేసెయ్. కేవలం ఆర్థిక సాయం మాత్రమే అడుగు..  అపుడే సేఫ్ అన్నట్లు కేసీఆర్ చేసిన సూచన మేరకు జగన్ ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అడిగితే ఏమవుతుందో జగన్ కి తెలుసు. దానిని అనవసరంగా రచ్చ చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. పైగా మొన్న మీటింగ్లో ఇద్దరు కేంద్రంపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై మోడికి ఫిర్యాదులు కూడా అందాయి.

అందుకే మోడీ తమకు దూరం కాక ముందే వివరణ ఇచ్చుకోవడానికి ఇద్దరు ఈ పర్యటనలు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. మీరు ఏం చేసినా మాకు సమ్మతమే అని, ఎవరు ఏం చెప్పినా నమ్మవద్దని మోడీని కోరడానికి, వినయం చాటి ప్రసన్నం చేసుకోవడానికి వీరు ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి నానాటికీ పెరిగిపోతున్న మోడీ ఇమేజ్ ను ఆపే పరిస్థితి లేదు. అందుకే మోడీతో గొడవ ఎందుకు కాస్త చల్లబరిస్తే చూసిచూడనట్లు వదిలేస్తారేమో అన్న ఆలోచనతో ఈ టూర్ ప్లాన్ చేసి ఉండొచ్చు. మళ్లీ కేసీఆర్, జగన్ గెలుస్తారో లేదో తెలియదు గాని... మోడీ గెలుపు మాత్రం గ్యారంటీ అన్నట్టే జరుగుతోంది ప్రచారం.