హాట్ సీక్రెట్: సోమేష్ కుమార్ నే ఎందుకు సీఎస్ చేశారు?

September 21, 2020

ఈరోజు అందరూ విన్న వార్త... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఎందుకు.... ప్రస్తుతం ఉన్న జోషి గారి రిటైర్ మెంట్ అయిపోయింది కాబట్టి. మరి సాధారణంగా చూస్తే ఇది ఒక క్రోనలాజికల్ పరిణామం. కానీ... తరచి చూస్తే దీని వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకునే కేసీఆర్... ప్రస్తుత సీఎస్ రిటైర్ మెంట్ ను కూడా చాలా దూరదృష్టితో చూసి... ఆ పోస్టును జాగ్రత్తగా ఫిల్ చేశారు. దీని వెనుక 2023 డిసెంబరు ఎన్నికల లక్ష్యం కూడా ఉంది. వాస్తవానికి సోమేష్ కుమార్ స్థానంలో వేరే వాళ్లు నియమితులు అవ్వాల్సి ఉంది. కాకపోతే కేసీఆర్ లాంగ్ టర్మ్ ప్లాన్ వల్ల  సోమేష్ సీన్లోకి వచ్చారు. 

మంగళవారం కేసీఆర్ సోమేష్ ఫైలుపై సంతకం చేశారు. జనవరి 1న సోమేష్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన రిటైర్‌మెంట్  2023 డిసెంబర్ 31. ఇందులో ముఖ్యమైన విషయం గమనించాలి. 2018 డిసెంబరులో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. మళ్లీ తెలంగాణ ఎన్నికలు (జమిలి రాకపోతే) 2023 డిసెంబరులో జరుగుతాయి. అంటే... అప్పటికి తనకు బాగా అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి కేసీఆర్ కు కావాలి. ఇపుడు కనుక సోమేష్ ని కాకుండా వేరే వారిని నియమిస్తే... ఎన్నికల ముందు మారిపోతారు. అపుడు ఎలాంటి వాడు దొరుకుతారో తెలియదు. అందుకే దూరదృష్టితో ఆలోచించిన కేసీఆర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆలోచించారు. 

పాలన పదిలంగా ఉండాలి, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి అనే లక్ష్యంతో తన అభిమాని అయిన సోమేష్ కుమార్ కు సీఎస్ బాధ్యతలు అప్పగించారు. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే రాష్ట్రానికి అసలైన పాలకుడు సీఎస్. అంటే అన్ని వ్యవస్థలు అతని చేతులోనే నడుస్తాయి. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన కార్యదర్శి సోమేష్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అంటే ఆల్మోస్ట్ ఎన్నికల కోడ్ లో కూడా అన్ని అస్త్రాలు, అధికారం కేసీఆర్ చేతిలో ఉన్నట్టే.  ఏం ప్లాన్ వేశావు సామీ నువ్వు అదుర్స్.... ఇంత దూరదృష్టితో ఆలోచించడం వల్లే తెలంగాణలో అందరినీ మడతపెట్టేసి పైచేయి సాధిస్తున్నావు!!