కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... పవన్ క్యారెక్టర్ స్టిల్స్ వైరల్

September 22, 2020

తెగించిన వాడు ఏమైనా చేస్తాడు. రాంగోపాల్ వర్మ జాతి అదే. అతన్ని ఎదుర్కోవడానికి మహిళా సంఘాలే భయపడతాయి అంటే... అతనేంటో చెప్పడానికి మరే వివరణా ఇవ్వక్కర్లేదు. ఎందుకో ఇటీవల జగన్ అభిమానిగా మారిపోయిన ఆర్జీవీ... మొన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీశాడు. సినిమా హిట్టుతో అతనికి అవసరం లేదు. జస్ట్ మీడియాలో తాను నిత్యం ఉండడానికి పనికొచ్చే ఒక సినిమా సబ్జెక్ట్ మాత్రమే అతనికి కావాలి. 

ఎన్నికల ఫలితాలు వచ్చాక... కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే గుంటూరు కృష్ణా జిల్లాలలో రాజధాని ఉండటం, రెడ్డి సామాజిక వర్గమైన జగన్ ముఖ్యమంత్రి కావడంతో మరో కాంట్రవర్సీ సినిమాకు వర్మ తెరతీశారు. పైగా ఇది నాన్ కాంట్రవర్సియల్ సినిమా అంటూ ప్రమోషన్ చేస్తూ సెటైర్ వేస్తున్నాడు. ఇక ఇందులో చంద్రబాబు, పవన్, జగన క్యారెక్టర్లు ఉంటాయనడంలో అనుమానం లేదు. అయితే పవన్ క్యారెక్టర్ తీర్చిదిద్దుతున్న తీరు అనుమానాలు కలిగేలా ఉంది. పవన్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురిచేసేలా ఉంది. పవన్ పొలిటికల్ ప్రసంగం చేస్తుంటే... హాట్ గా రెడీ అయిన నలుగురు అందమైన అమ్మాయిలు స్టేజిమీద హడావుడి చేస్తున్నట్లు కనిపించే ఒక స్టిల్ తాజాగా విడులైంది. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వర్మను బండబూతులు తిడుతున్నారు. 

సాయంత్రం లోకేష్ క్యారెక్టరుతో మాట్లాడుతున్న పవన్ క్యారెక్టర్ స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. ఏతావతా... తెలుగుదేశం, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ... జగన్ అభిమానాన్ని పొందడానికి ఆర్జీవీ సిద్ధమయ్యాడు.