కువైట్ లో కోడెలకు ఘన  నివాళి

September 24, 2020

కువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన శ్రీ కోడెల శివప్రసాదరావు గారి మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని కువైట్ లో నివసిస్తున్న ప్రవాసీలు శుక్రవారం తెలుగు దేశం కువైట్ అద్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఫర్వానియా లోని దవాహి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పేర్కొన్నారు  

2015 లో తొలిసారిగా కువైట్ లో పర్యటించిన శ్రీ కోడెల గారు ప్రవాసాంధ్రులు పడుతున్న కష్టాలను భారత రాయబార అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వాసు మగులూరి, తలమంచి శ్రీనివాస్, ప్రశాంత్, పార్థసారథి, బాబు పోలారపు, ఉర్దూ కవి సాఈద్ నజర్,  కొత్తపల్లి మోహన్, ఈశ్వర్ నాయుడు, నాగార్జున, శ్రీను బోయపాటి, కల్యాణ్, సుబ్బారెడ్డి, ముస్తాఖ్ ఖాన్, నాయనిపాటి విజయ్, గోపి, అర్షద్, నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

  • No related artciles found