గుడికోసం ఎంఐఎం వినతిపత్రం... కథేంటి?

September 21, 2020

నిన్న ఒక విచిత్రం జరిగింది. పాతబస్తీ పరిధిలోని మహంహకాళి దేవాలయం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని అక్బరుద్దీన్ అనే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చారు. పైకి వినిపించిన వార్త ఇది. ఒక ఎమ్మెల్యే ఒక చిన్న గుడిని అభివృద్ధి చేయమని వినతిపత్రం ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. మరెందుకు ఇలా జరిగింది? దీని వెనుక బోలెడు కథ ఉంది. 

వాస్తవానికి నిన్న ఇచ్చిన వినతి పత్రంలో అత్యధికం మసీదు నిధుల గురించి ఉన్నాయి. ఐదారు మసీదులకు నిధులు కావాలి. వాటిని కేసీఆర్ ఇస్తాను అన్నారు. మరి అసలే దేశంలో సూడో లౌకికపాదంపై చాలా ఆగ్రహంగా ఉన్న ప్రధాని మోడీ నిజమైన భారతీయులు ఏ మతస్తులైనా పర్లేదు గాని అదే పనిగా ఇతర మతాలకు సాయం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇప్తార్ విందులు కూడా మోడీ జమానాలో బీజేపీ బంద్ చేసింది. పైగా సీఏఏ, ఎన్నార్సీ తెచ్చి నఖిలీ భారతీయులను ఏరేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి మసీదులకు నిధులు కేటాయిస్తే అనవసరంగా రాద్దాంతం అవుతుంది. మోడీ దృష్టిపెడతారు. అందుకే మసీదుల వినతి పత్రంలో మహంకాళి ఆలయాన్ని చేరిస్తే... వార్తల్లో అదే హైలెట్ అవుతుంది, మసీదుల గురించి ఎవరూ పట్టించుకోరు అని కేసీఆర్ ఆలోచనట. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 

అక్బరుద్దీన్ ఎవరు? - రాజాసింగ్

ఈరోజు మహంకాళి ఆలయం అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్లాన్ మేరకు వినతి పత్రం ఇచ్చిన అక్బురుద్దీన్ ఎవరు... ఒకప్పుడు హిందుత్వాన్ని, గోమాతను, దేశాన్ని తిట్టిన వ్యక్తి. జాతీయ జెండాను మోయని పార్టీకి వారసుడు. దేశద్రోహం కేసులు ఇంకా అతనిపై ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి  మహంకాళి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిని కోరతాడా అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. ఇదంతా ఒక ప్లాను ప్రకారం చేశారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. 

 

వాస్తవం ఏంటి?

నిజానికి పూజలు, యాగాలు గట్టిగా చేసే కేసీఆర్ ఎందుకు ఎంఐఎంతో రాసుకునిపూసుకుని తిరుగుతున్నాడు అని కొందరికి అనుమానం ఉంది. కేసీఆర్ కి రాజకీయం తెలియదా? బాగా తెలుసు. తెలంగాణలో ఎంఐఎం గెలిచే సీట్లు 7. కాబట్టి వారు టీఆర్ఎస్ కు పోటీ కాదు. కానీ ముస్లింలు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద సంఖ్యలో ఉన్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తే... ఆ ఏడింటిలో కాకుండా మిగతా అన్ని సీట్లలో తెలంగాణ ముస్లింల ఓట్లు కొట్టేయొచ్చు అన్నది ప్లాన్. ఇది ఎంఐఎంకు కూడా తెలుసు. మాకది, మీకిది పద్దతిలో క్విడ్ ప్రొ కొ రాజకీయం చేస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు బహిరంగంగా హిందుత్వాన్ని, జాతీయతను వ్యతిరేకిస్తూ దర్జాగా బతికేవాళ్లు. క్రమంగా మోడీ కంట్రోల్ చేసేటప్పటికి... గుళ్లు గోపురాల గురించి మాట్లాడుతూ... పరోక్షంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవలే పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకుని ఒక సభ కూడా పెట్టారు. అంతకుముందు ఏనాడూ ఆగస్టు 15, జనవరి 26 ఉత్సవాలు ఆ పార్టీ ఆఫీసులో చేయలేదని అంటుంటారు.