కరోనా... మోడీ చేసిన బిగ్ మిస్టేక్ ఇదే

September 27, 2020

మోడీ 8 గంటలకు వస్తాడంటే జనానికి ఒక భయం. దీనికి అతిపెద్ద కారణం... నోట్ల రద్దు. ఆ తర్వాత కూడా 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించినవి డేంజర్ గానే ఉన్నా... తమ సాధారణ జీవనం గురించి మోడీ నోట్ల రద్దు సమయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో మోడీ ఇలాంటి సీరియస్ నిర్ణయం తీసుకున్నారంటే వెంటనే కంగారు పడతారు. 

తాజాగా కరోనా నేపథ్యంలో 8 గంటలకు నిన్న రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. సుదీర్ఘంగా ప్రసంగించినా కూడా మూడు వారాలకు ప్రజలకు తిండి తిప్పలు ఎలా అన్న విషయం ప్రసంగంలో చెప్పకపోవడంతో నిన్న మోడీ కరోనా నివారణ ఐడియా రివర్స్ అయ్యి ప్రమాదాలను తెచ్చిపెట్టేలా మారింది. ప్రసంగం ముగిశాక ఏవేవి ఓపెన్ ఉంటాయని నోట్ వచ్చింది. వార్తల్లో కూడా చెప్పారు. కానీ జనం మోడీ నోటి నుంచి 21 రోజులు గడప దాటకూడదు అనే మాట మాత్రమే గట్టిగా గుర్తుపెట్టుకున్నారు. అంతే పిల్లా జల్లా దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్లకు పరుగెత్తారు.

దేశంలోని పలుచోట్ల ఇది కనిపించింది. పుణె వంటి పెద్ద నగరాల్లో చదువుకున్న వాళ్లు కూడా పిల్లా జెల్లతో డీమార్ట్ తదితర స్టోర్లకు పరుగులు తీశారు. విపరీతమైన క్రౌడ్ కారణంగా కరోనా మూడో దశలోకి పోతుందేమో అని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. నోట్ల రద్దు సమయంలో నోట్లను అర్ధరాత్రి నుంచి చెల్లవని చెప్పి ప్రత్యామ్నాయం వెంటనే చూపకపోవడంతో చాలా ఇబ్బందులు పడిన జనం ఇపుడు కూడా అలాగే చేస్తారేమో అని కంగారు పడ్డారు. 21 రోజుల ప్రకటనలో ఆవెంటనే అని కిరాణా, సూపర్ మార్కెట్లు తెరచి ఉంటాయని మోడీయే ప్రకటించి ఉంటే జనంలో ఈ కంగారు ఉండేది కాదు. 

ప్రస్తుతం ఎక్కడ చూసినా సూపర్ మార్కెట్లలో ర్యాక్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి. ఆలస్యంగా వచ్చిన వారికి సరుకులు కూడా దొరకని పరిస్థితి. కూరగాయలు కూడా పిచ్చెక్కినట్లు కొంటున్నారు. నిజానికి ప్రభుత్వం అత్యవసరాలను బ్యాన్ చేయలేదు. వారిని ఇబ్బంది పెట్టడం లేదు.

Read Also

ఆర్కేకు మోడీ కాంప్లిమెంట్
మోడీకి రామోజీ ఇచ్చిన సలహాకు ప్రధాని ఏం చెప్పారు?
ఈ ఫొటోలు చూస్తే మీరు ఇంటి నుంచి బయటకు రారు