ఆర్కేకు మోడీ కాంప్లిమెంట్

September 26, 2020

మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దగ్గర దగ్గర అరగంట పాటు మాట్లాడిన మోడీ.. కరోనా మీద పోరాడేందుకు కీలక నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణకు ప్రత్యేకంగా ఫోన్ చేయటం గమనార్హం.

మీడియా అధినేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తాను ఎక్కువగా మాట్లాడలేకపోయినట్లు చెప్పిన ప్రధాని.. కరోనా వేళ ప్రకటించిన లాకౌట్ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఏమేం చేస్తే బాగుంటుందన్న సూచనల్ని కోరారు.
దేశ వ్యాప్తంగా ఉన్న 20 ప్రముఖ దినపత్రికల అధినేతలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆర్కే.. మూడు వారాల కర్ఫ్యూ వేళ.. నిత్యవసర వస్తువుల సరఫరా ప్రధాన సమస్యగా మారుతుందని.. నిత్యవసర వస్తువుల బ్లాక్ మార్కెట్ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. రానున్న రోజుల్లో ధరల్ని మరింత పెంచే అవకాశం ఉందన్నారు.
లాక్ డౌన్ మీద తీవ్ర ప్రభావం చూపించే ఈ అంశాన్ని పరిష్కరించగలిగితే.. కరోనాపై పోరాటం.. కర్ఫ్యూ సక్సెస్ అవుతుందన్నారు. అందుకే నిత్యవసరాలు ప్రభుత్వమే విక్రయాలు జరపటం.. లేదంటే ఇంటింటికీ నిత్యవసరాలు అందేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని చెప్పారు. ఆర్కే చేసిన సూచనకు ప్రధాని మంచి సూచన అంటూ కాంప్లిమెంట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. దేశంలో ఇన్ని మీడియా సంస్థలు ఉన్న వేళ.. ప్రధాని మోడీ ఫోన్ చేసిన అతి తక్కువమంద మీడియా అధినేతల్లో ఆంధ్రజ్యోతి ఆర్కే ఒకరు కావటం గమనార్హం. 

Read Also

మోడీకి రామోజీ ఇచ్చిన సలహాకు ప్రధాని ఏం చెప్పారు?
ఈ ఫొటోలు చూస్తే మీరు ఇంటి నుంచి బయటకు రారు
21 రోజులు... మీరు తెలుసుకోవాల్సిన నిజాలు