వైసీపీ ఎమ్మెల్యేలకు నాగబాబు చెప్పింది చేసే దమ్ముందా?

September 22, 2020

అమరావతి రైతుల పోరాటం... రాజధాని ఉద్యమాన్ని గ్రామం నుంచి రాష్ట్ర వ్యాపితం చేసింది. ఒక్క వైసీపీ నేతలు తప్ప ఈ ఉద్యమానికి అందరూ మద్దతు పలుకుతున్నారు. అయితే... దీనిపై ఈరోజు తీవ్రంగా స్పందించిన జనసేన  నేత నాగబాబు రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. వైసీపీ అధినేతను హెచ్చరించారు. వైసీపీ నేతలను గిల్లారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...

‘‘రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయం.ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం.మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నా. రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్ యల్ యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతం లో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది.కులం ఎప్పుడు చెడ్డది కాదు.మలుషుల్లోనే చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు వుంటారు.ఇలా కులాలమీద పగబట్టి వాళ్ళ జీవితాలతో ఆదుకోవడం ఎవరికి మంచిదికాదు యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లేర్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు.అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడు.ప్లీస్ జగన్ రెడ్డి గారు మీరు ఆ తప్పు చేయకండి. తప్పు దిద్దుకోవడానికి ఇంకా మీకు సమయం ఉంది’’ 

ఇది నాగబాబు వ్యాఖ్య. ఆళ్ల, పేర్ని, బొత్స, పెద్దిరెడ్డి... ఇలాంటోళ్లందరూ ఎక్కడో తమ రూముల్లో కూర్చుని రాజధాని గురించి మాట్లాడుతున్నారు.. మీకు దమ్ముంటే అమరావతి రైతల మధ్య వచ్చి అవే మాటలు మాట్లాడండి. నాకు చూడాలని ఉందంటూ... నాగబాబు వేసిన సెటైర్ తో ప్రజల్లో ఉద్యమ తీవ్రతను తెలిపే ప్రయత్నం చేశారు నాగబాబు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందనకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. వాళ్లకు అంత దమ్ములేదు సార్ అని ఒకరంటే.. జగన్ మరియు అతని టీం అమరావతిలో ఇపుడు 3 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే చూడాలని ఉంది అని ఇంకొక నెటిజన్ కామెంట్ చేశారు. ఈరోజు రాజధానిలో ముఖ్యమంత్రికి రక్షణ లేనంత ఘోరమైన తప్పులు చేశారు ముఖ్యమంత్రి.