నాని నవ్వించి చంపేస్తాడు... టీజర్ లోనే హిట్టు ’కళ‘

September 23, 2020

నాని ఇటీవల జెర్సీ సినిమాతో అందరి మనసులు దోచాడు. అన్నీ సక్సెస్ లు చూపించే సినిమాలే. కానీ... ఇది ప్రతి జీవితంలో ఉండే ఫెయిల్యూర్ ను తాకిన సినిమా. అందుకే ఓ రేంజిలో అందరినీ ఆకట్టుకుంది. అయితే, నాని వెంటనే ఇంకో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈరోజు గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ చూస్తే... హిట్ గ్యారంట ీఅని ఎవరికయినా ఇట్టే అనిపిస్తుంది. తెలుగులో క్రైమ్ కామెడీలు ఇప్పటికే చాలా హిట్టయ్యాయి. అయితే, క్రైమ్ కామెడీల్లో నటీనటుల హావభావాలు కథకన్నా కూడా చాలా ఇంపార్టెంట్. మైత్రిమూవీ మేకర్స్ వాళ్లు... ఈ క్రైమ్ కామెడీ కథకు నానిని ఎంపిక చేసుకోవడమే వారి మొదటి సక్సెస్. టీజర్ లో హిట్టు కళ స్పష్టంగా కనిపస్తోంది.  

RELATED ARTICLES

  • No related artciles found