గవర్నమెంటుపై నారా భువనేశ్వరి కామెంట్స్ 

September 22, 2020

జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ వేడుకలు వదిలేసి రైతులతో ధర్నాకు కూర్చున్న భువనేశ్వరి సంక్రాంతి పండగను కూడా చేసుకోకుండా రైతులకు సంఘీభావంగా వారితో పాటు దీక్షలో కూర్చున్నారు. భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి కూడా దీక్షకు హాజరయ్యారు. సాధారణంగా ప్రతి సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం సంక్రాంతి పండగకు నారా వారి పల్లెకు వెళ్లి జరుపుకుంటుంది. కానీ ప్రభుత్వం రాజధాని గొడవను తెరపైకి తేవడంతో రాష్ట్రంలో పండగ వాతావరణం లేకుండా పోయింది. క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఏ పండగలు ప్రజలు జరుపుకోవడం లేదు. 

ముగ్గుల్లో కూడా నిరసనలు, ఆవేదనే కనిపిస్తోంది. మా పొలం ఈ రాష్ట్రం కోసం ఇస్తే మమ్మల్ని అన్యాయం చేశారంటూ వారు ఆవేదన చెందుతున్నారు. నారా భువనేశ్వరి దీక్ష శిబిరంలో మాట్లాడుతూ... మహిళలపై చేయిచేసుకోవడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. గొప్ప రాజధాని నిర్మిస్తానన్న చంద్రబాబు పిలుపుతో వేలాది మంది రైతులు భూములు త్యాగం చేశారని ఆమె అన్నారు. 

రాజధాని కోసం తాను కష్టపడి సంపద సృష్టిస్తానని, స్వయంపోషక రాజధానిగా అమరావతి విలసిల్లుతుందని, ప్రాథమికంగా మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు అవసరం అవుతాయని కొంతకాలానికి ఆ నగరమే అన్ని ఖర్చులు సంపాదించే స్థాయికి వెళ్లి స్వయంసమృద్ధి సాధించి ప్రజలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం సృష్టించిస్తుందని ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారని  భువనేశ్వరి అన్నారు. దాడులు చేసినా మహిళలు భయపడకుండా పోరాటపటిమ చూపుతున్నారని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.