రావాలి జగన్...కావాలి జగన్ : సీబీఐ

September 25, 2020

యాదృచ్ఛికం, కో ఇన్సిడెన్స్, సందర్భం... ఏమైనా అనండి. ఎన్నికల కోసం జగన్ రాయించిన పాట... ఇపుడు సీబీఐ ప్లే చేస్తోంది. రావాలి జగన్... కావాలి జగన్... అంటోంది. విషయం ఏంటంటే...  వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిచ్చి కారణాలు చెప్పిన జగన్ కు నాంపల్లి సీబీఐ కోర్టు స్ట్రిక్ట్ గా నో చెప్పింది. వ్యక్తిగత మినహాయింపు కోరుతూ... జగన్ తరఫున లాయర్ సమర్పించిన పిటిషనులో కారణాలు ఏవీ సమంజసంగా లేనందున మినహాయింపు ఇవ్వడం కుదరదు అని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. 

మినహాయింపు దొరుకుతుందనే ఆశతో జగన్ ఈరోజు కోర్టుకు రాలేదు. ఏ2 గా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు మరికొందరు ఐఏఎస్ లు హాజరయ్యారు. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా హాజరు అయ్యారు. వచ్చే వారం నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో సీబీఐ కోర్టుకు హాజరవుతున్న వ్యక్తిగా జగన్ రికార్డు సృష్టించబోతున్నారు. కీలకమైన పదవి, ఖర్చులు వంటివి అక్రమ కేసుల నుంచి మినహాయింపు ఇవ్వడానికి తగిన కారణాలుగా భావించడం లేదని సీబీఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో జగన్ ఆశ నెరవేరలేదు. 

దీనిపై సోషల్ మీడియా చాలా వెరైటీగా స్పందించింది. కోర్టు కు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ వీడియో పోస్టులు పెడుతున్నారు. ఈ కోర్టు తీర్పు ఈరోజు వైరల్ అవుతోంది. జగన్ పాటతోనే జగన్ కి ఇపుడు చిక్కొచ్చి పడింది.