అద్వానీకి జ‌గ‌న్ ఫ్రెండ్ వెన్నుపోటు

September 22, 2020

గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో మోడీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఊడ‌కుండా కాపాడిందెవ‌రు?
అద్వానీ.
అపుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఊడి ఉంటే... ఈరోజు మోడీ ప్ర‌ధాని పీఠం దాకా వ‌చ్చేవాడా?
లేదు.
ఇదీ పాయింట్‌. త‌న‌కు రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌సాదించిన అద్వానీకి న‌రేంద్ర‌మోడీ వెన్నుపోటుతో రుణం తీర్చుకున్నారు. అద్వానీ కేవ‌లం మోడీకి సాయం చేసిన వాడు మాత్ర‌మే కాదు. బీజేపీ వ్య‌వ‌స్థాపకుల్లో ఒక‌డు. రెండు సీట్ల నుంచి బీజేపీని 200 సీట్ల‌కు తెచ్చిన వాడు. అలాంటి వ్య‌క్తి... మ‌న తెలుగు నేత‌లైన జ‌గ‌న్, కేసీఆర్ ఆరాధ్య‌దైవం అయిన న‌రేంద్ర‌మోడీ అడ్డంగా వెన్నుపోటు పొడిచాడు. ఈ వెన్నుపోటు అద్వానీ ప‌రువు మీద ప‌డింది. దిగ‌జారిన ఈ రాజ‌కీయాల్లో త‌ప్పుడు వ్య‌క్తుల పరువు పోదు. మంచి వాళ్ల ప‌రువే పోతుంది. భ‌క్త్‌..లంద‌రూ మోడీని గుడ్డిగా నమ్మిన ఫ‌లితం ఇది. పుండు మీద కారం చ‌ల్ల‌డం అంటారు క‌దా... అలాగ అద్వానీ సీటును లాగ‌డ‌మే కాదు, దాన్ని అది అమిత్ షా తాను ద‌క్కించుకోవ‌డ‌మే ఇక్క‌డ వైచిత్రి.
వ‌యోభారం సాకుతో గురువుకు పంగ‌నామాలు పెట్టిన శిష్యుడిగా మోడీ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని అద్వానీ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ మ‌ధ్య‌న ఒక‌కార్య‌క్ర‌మానికి అద్వానీ, మోడీ హాజ‌ర‌వ్వ‌టం... ఆ స‌మ‌యంలో ప్ర‌తిన‌మ‌స్కారం పెట్ట‌కుండా అద్వానీని అవ‌మానించ‌డం తెలిసిందే గా. అక్క‌డి నుంచి మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవ‌డం మొద‌లైంది. స‌రే ఏం చేసినా... ఆ రాష్ట్రప‌తి ప‌ద‌వేదో ఆయ‌న‌కు ఇచ్చి ఉంటే ...మోడీని జ‌నం క్ష‌మించేవారు. కానీ కంసుడిలా ఆయ‌న వంద త‌ప్పులు చేసేశారు. ఇక జ‌నం ఓటు శాపం పెట్ట‌డానికి రెడీ అయ్యారు.