లేటెస్ట్ - ఏపీకి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ ఇదే

September 22, 2020

జగన్ వచ్చాక ఆంధ్రప్రదేశ్ కి దరిద్రం పట్టుకుంది. ప్రతిరోజూ ఏపీకి పేపర్లో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోంది. జగన్ అనుభవ రాహిత్యం రాష్ట్రానికి శాపంగా మారుతోంది. ప్రత్యేకహోదాపై కేంద్రం ఎన్నిసార్లు అడిగినా మొండిచెయ్యి చూపించింది. సాక్ష్యాత్తూ పార్లమెంటులోనే అనేక సార్లు నో చెప్పింది. మోడీ ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని అర్థం చేసుకున్న చంద్రబాబు మోడీని మచ్చిక చేసుకుని కొన్ని ప్రాజెక్టులు, డబ్బులు తెచ్చుకున్నాడు. ప్యాకేజీ ఇప్పించుకున్నాడు. అయితే, ప్రతిపక్షం వేసిన ట్రాప్ లో పడిన చంద్రబాబు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నాడు. దీంతో అటు ప్యాకేజీ పాయె, ప్రత్యేక హోదా రాకపాయె... అన్నట్టుంది ఏపీ పరిస్థితి.
జగన్ తనకు 25 మంది ఎంపీలు ఇస్తే చిటికెలో ప్రత్యేక హోదా తెస్తాను అన్నారు. అంతే... గెలిచిన వెంటనే ఢిల్లీ పోయి రిక్వెస్ట్ చేద్దాం అంటున్నాడు. మొత్తానికి బీజేపీ -జగన్ వ్యవహారం చూసిన వారంతా ప్రత్యేక హోదాపై ఆశ వదులుకున్నారు. ఈరోజు పార్లమెంటులో జరిగిన తాజా గా ఘటనతో ఏపీకి ప్రత్యేక హోదా రావడం పక్కన పెడితే... ఆర్థిక సాయం కూడా ఏమీ ఉండదని స్పష్టంగా తేల్చేశారు కేంద్ర పెద్దలు.
**కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే అన్ని రాష్ట్రాలకు సంయుక్తంగా ఇస్తుంది గానీ... ఏపీకి మాత్రమే ప్రత్యేకంగా ఏ ప్రత్యేక రాయితీలను ఇచ్చేది లేదని** కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టంచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని విడిపోయిన తెలంగాణలో మిగిలిపోవడంతో ఏపీలో ఏ పరిశ్రమలు లేవు. దీంతో ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇస్తే కొన్ని పరిశ్రమలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన ఉద్దేశం ఇదే. ఐదేళ్ల పాటు వచ్చే రాయితీల కోసం ఇక్కడికి కంపెనీలు వస్తే రాష్ట్రం వృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆనాటి ప్రధాని పార్లమెంటులో హామీ ఇచ్చారు. కానీ దానిని తుంగలో తొక్కారు ప్రధాని మోడీ.
’’విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుందని, అందుకే ఏపీకి ప్రత్యేక ఇన్సెంటివ్ లు విభజిత న్యాయం కోటాలో కూడా ఇవ్వలేం‘‘ అని మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. వైసీపీ లోక్ సభ సభ్యుడు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు గడ్కరీ.
ప్రత్యేక హోదా, బ్యాంకు రుణాలు, పెట్టుబడులు.. ఇలా అన్ని వెనక్కు వెళ్తే.... ఏపీ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి. జగన్ స్థానికులకు అదృష్టం కల్పిస్తా అంటూ తెచ్చిన అవగాహన లేని బిల్లు వల్ల ఇప్పటికే రాయితీల్లేవు ఏపీకి ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్న పరిశ్రమలు 75 శాతం ఉద్యోగాలు లోకల్ కే ఇవ్వాలన్న చట్టంతో గుడ్ బై ఏపీ అనే పరిస్జితి. జగన్ వాస్తవాలు అర్థం చేసుకోకపోతే రాష్ట్రం మరింత ఆర్థిక లోటులో కూరుకుపోయే ప్రమాదం ఉంది.