రాజధానిపై పవన్ కొత్త పాయింట్

September 25, 2020

రాజధాని విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాజధాని కదలికతో జగన్ చంద్రబాబును దెబ్బతీశాను అనుకుంటున్నారు. చంద్రబాబు ఏమో ... జగన్ దొరికిపోయాడు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణేమో ఆచితూచి స్పందిస్తున్నాడు. మొన్న ఒకరోజు రాజధాని రైతులకు మద్దతుగా అమరావతిలో ధర్నాకు వచ్చిన పవన్ కళ్యాణ్ వారికి నిరంతరం మద్దతు పలుకుతున్నాడు. మొన్నటి అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తాజాగా అమరావతిపై కొత్త పంచాయితీ పెట్టారు పవన్. 

మిగతా రాష్ట్రాలు వేరు, ఏపీ వేరు అని. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని బాధ్యత కేంద్రానిదే అని... కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. కేంద్రం ఈ విషయంలో పెద్దన్న పోసించి... అఖిల పక్ష సమావేశం పెట్టి ఈ సమస్యకు తుది పరిష్కారం చూపాలని కోరారు. వాస్తవానికి పవన్ లేవనెత్తిన పాయింట్లో కొంత నిజముంది. నిధులు ఎలాగూ సరిగా ఇవ్వలేకపోయింది. ఏదో విధంగా మెల్లగా ఏపీ సర్దుకుంటున్న నేపథ్యంలో మళ్లీ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో, స్వలాభం కోసం రాజధాని విషయంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబును ఎదురించడం కోసం, దెబ్బకొట్టడం కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. వద్దన్న పనిని అదేపనిగా చేసే జగన్ మాట వినాలంటే... కేవలం కేంద్రం చెబితేనే వింటాడు. అందుకే ప్రజలు కేంద్రాన్ని డిమాండ్ చేసేలే పవన్ వారికి మార్గం చూపిస్తున్నాడు. ఆ కోణంలోనే కేంద్రం జోక్యాన్ని పవన్ కోరుకున్నారు. మరి దీనిపై కేంద్రం గాని, బీజేపీ నేతలు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.