​నన్నెవడు ఆపుతాడు అంటూ సవాల్ చేసిన పవన్

September 24, 2020

151 సీట్లతో గెలిచినా జగన్ లో భరోసా కనిపించడం లేదు. కుట్రలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 63 సీట్ల మెజారిటీతో ఉన్న జగన్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అంటే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి జగన్ ని బాగా భయపెట్టాయనే చెప్పాలి. ఒక వైపు తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్ గా తనపై చేసిన పాత విమర్శలను జగన్ తప్పులతో కంపేర్ చేసి వైసీపీ నేతలకు నోటి మాట రాకుండా చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ... వైసీపీ లాంటి తెగింపు రాజకీయాలతో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. వెరసి వైసీపీలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. తక్కువ సమయంలో రాయలసీమ టూర్ ప్రకటించిన పవన్... అక్కడ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కడప నడిబొడ్డుకు వెళ్లి జగన్ కు ఛాలెంజులు విసురుతున్నారు. పవన్ మత రాజకీయాన్ని నిలదీశారు. వైకాపా నాయకుల మాఫియాను ప్రశ్నించారు. 

జనసేన పార్టీ తరఫున పవన్ తప్ప మరో బలమైన వాయిస్ కనిపించడం లేదు. వైసీపీ లో 151 మంది ఆ ఒక్కడే భయపెడుతున్నాడు. పవన్ వైసీపీ నేతలందరికీ ఒక్కడే సమాధానం చెబుతున్నాడు. వారికి నిద్రపట్టనివ్వడం లేదు. కనీసం ఏ కేసులేని పవన్ కళ్యాణ్ ను ఎలా అదుపు చేయాలో తలపట్టుకుని కూర్చుంది వైసీపీ ప్రభుత్వం. అందుకే కుటుంబం గురించి, ఏదో ఏపీకి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమవుతున్నారు. 

తాజాగా రాయలసీమ పర్యటనలో భాగంగా మదనపల్లిలోని టమోటా రైతులతో మాట్లాడటానికి పవన్ ప్లాన్ వేసుకుంటే... రైతులతో మాట్లాడితే వాస్తవాలు బయటపడతాయని అనుకున్నారో అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్కెట్ కార్యదర్శి చేత రైతులు ఇబ్బంది పడతారు రావద్దంటూ లేఖ రాయించారు. అయితే, ఈ కుట్రపై పవన్ సీరియస్ గా స్పందించారు. 

టమాటా రైతులతో మాట్లాడతానంటే అనుమతి ఇవ్వనంటున్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా రైతులతో మాట్లాడే నా హక్కును ఎవరూ అడ్డుకోలేరు. రేపు అనుమతి ఇవ్వకుంటే రోడ్డుపై కూర్చుని రైతులతో మాట్లాడతాను. రాయలసీమ ఎవరి సొత్తూ కాదు, కొన్ని వర్గాలు అదుపులో పెట్టుకోవాలని చూస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పొడిచినా ఒకటే రక్తం, నన్ను పొడిచినా ఒకటే రక్తం వస్తుంది. తెగించాను. మీ అరాచకాలు భరించను.  నేను రేపు రైతలతో మాట్లాడుతా అని ఖరాఖండిగా చెప్పారు.  టమాటా మార్కెట్ కు వెళ్తా.. ఏ వైసీపీ ఎమ్మెల్యే నన్ను ఆపుతారో చూస్తానని సవాల్ చేశారు. దీనిపై వైసీపీ నాయకులు ఏం చేస్తారో రేపు చూడాలి.