జ‌గ‌న్ ఇలా అన్నాడో లేదో.. ప‌వ‌న్ వెంట‌నే

September 24, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విష‌యంలో ఇప్ప‌టికి ఉన్న గంద‌ర‌గోళం చాల‌ద‌ని.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌తో మ‌రింత అయోమ‌యానికి తెర‌తీశాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. రెండు రోజుల కింద‌టే ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ లిఖిత‌పూర్వ‌కంగా చెప్పారు. ఇంత‌లోనే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌పోజ‌ల్‌ను స‌భ ముందుకు తెచ్చారు. దీనిపై ఏపీలో పెద్ద చ‌ర్చే మొద‌లైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమ‌రావ‌తిని ఏరి కోరి రాజ‌ధానిగా ఎంపిక చేసిన తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈలోపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ట్విట్ట‌ర్లో యుద్ధం మొద‌లుపెట్టేశాడు.

జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న మీద కొంచెం ఘాటుగానే వ్యాఖ్య‌లు చేశాడు ప‌వ‌న్. ‘‘తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.అలాగా ,ఒక్క అమరావతి రాజ‌ధానికే దిక్కు దివానం లేదు ఇప్ప‌టిదాకా, మ‌రి జ‌గ‌న్ రెడ్డి గారి మూడు అమ‌రావ‌తి న‌గ‌రాలు అస‌లు అయ్యే ప‌నేనా? పాల‌కుల వ‌ల‌న రాష్ట్ర విభ‌జ‌న మొద‌లుకుని ఇప్ప‌టిదాకా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కి అనిశ్చితి, అశాంతి, అభ‌ద్ర‌త త‌ప్ప ఇంకేమి ఒర‌గ‌లేదు.

హై కోర్ట్ కర్నూల్ లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్ కి వెళ్లాలా ? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి? కమిటీ రిపోర్ట్ రాకమునుపే, జగన్రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించే కాడికి , అసలు కమిటీలు వెయ్యడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా?’’ అంటూ జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు సంధించాడు ప‌వ‌న్.