బీ రెడీ... బాహుబలి 3 రావొచ్చట !

September 27, 2020

ఫ్రెండ్స్ తన సినిమాను నిర్మిస్తుండటంతో ‘సాహో’ కోసం ప్రభాస్ భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. నిద్ర లేకుండా దాని కోసం తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని ప్రకటించారు. తాను బాహుబలి 3కి సిద్ధంగా ఉన్నాను అని... రాజమౌళి కనుక ముందుకు వస్తే... బాహుబలి 3 మనందరం చూడొచ్చన్నారు.
భారతీయ సినిమా చరిత్రను కొత్తమలుపు తిప్పిన సినిమా బాహుబలి. భారతీయ బడ్జెట్లను కూడా అది మార్చేసింది. ఈరోజు ప్రభాస్ మీద ఇంత డబ్బులు పెట్టారంటే దానికి కారణం కూడా బాహుబలే. రోబో 2 కు అంత ఖర్చయిందంటే... దానికీ బాహుబలే కారణం.
ఈ సందర్భంగా బాహుబలి గురించి ఒక ప్రత్యేక విషయం వెల్లడించారు ప్రభాస్. బాహుబలి రెండు భాగాల్లో కలిపి జనాలకు చెప్పిన కథ 60 శాతమే అని. ఇంకా 40 శాతం మాత్రం కథ మిగిలి ఉందన్నారు. రాజమౌళి మదిలో బాహుబలి సీక్వెల్‌-3 ఉందని, అయితే అదెపుడు పట్టాలెక్కుతుందో తెలియదన్నారు.
బాహుబలి కోసం తన జీవితంలో నాలుగేళ్లు కేటాయించానని, నా జీవితంలో అమరేంద్రబాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.