జగన్‌పై సినీ ప్రముఖుడి ఫైర్

September 24, 2020
CTYPE html>
మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. సినీ రంగ ప్రముఖుడు, నిర్మాత అశ్వనీదత్ ఈరోజు జగన్‌పై మండిపడ్డారు. తన జీవితంలో జైఆంధ్ర ఉద్యమం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ఉద్యమాలను చూశానని... కానీ, అమరావతి ఉద్యమాన్ని అణచివేస్తున్న దారుణమైన తీరును మాత్రం ఎన్నడూ చూడలేదని అయన అన్నారు. రైతుల తలలు పగిలేలా లాఠీలతో కొట్టారని.. ఇదేమి ఘోరమని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలోని మూడు గ్రామాల్లో ఈరోజు తాను పర్యటించానని తెలిపారు. ఒక్క ఇంట్లో ఒక మహిళ ఉంటే... ఇంటి బయట ఆ మహిళకు నలుగురు పోలీసులు కాపలాగా ఉన్నారని.. ఇలాంటి అణచివేత ముందెన్నడూ లేదన్నారు.
టెంట్లు వేసుకున్న రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టి... అక్కడ పోలీసులు కూర్చుంటున్నారని తెలిపారు. ఇన్ని టెంట్ల నిండా సరిపడేంత మంది పోలీసులు ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. పోలీస్ దుస్తుల్లో ప్రైవేట్ వ్యక్తులను దించారని తెలిపారు. మహిళా పోలీసుల రూపంలో వచ్చినవారి జేబుల్లో బ్లేడ్లు ఉన్నాయని ఆడవాళ్లు చెబుతున్నారని అన్నారు.
మూడు రాజధానులకు మద్దతు పలికేవారికి ఏబీసీడీలు కూడా తెలియవని, ఎకానమీ గురించి తెలియదని అశ్వనీదత్ చెప్పారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి జగన్ వచ్చారని... రాయలసీమ ఎక్కడుంది? విశాఖ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. అమరావతికి గతంలో జగన్ కూడా అంగీకరించారని... 30 వేల ఎకరాలు కావాలని కూడా అన్నారని చెప్పారు. గొప్ప విజన్ ఉన్న చంద్రబాబును నమ్మి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు జగన్ వచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆయన ఆరోపించారు.