ఉల్లిపాయతో మనిషిని చంపిన ఏపీ సర్కారు... రచ్చ 

September 25, 2020

 చరిత్ర ఎరుగుని ఘటన ఇది. ఏపీలో మార్కెట్ నిర్వహణలో విఫలమైన జగన్ ప్రభుత్వం ఉల్లిధరలను కంట్రోల్ చేయడానికి ప్రజల డబ్బులు పెట్టి కొని ప్రజలకే తక్కువ ధరకు విక్రియిస్తోంది. ఈ క్రమంలో జనాలు ఉల్లికోసం ఎగబట్టారు. ఆ క్యూని కూడా కట్టడి చేయలేని ప్రభుత్వం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దీనిపై సామాన్యులు,  ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. మరీ ఉల్లిపాయి కోసం మనిషిని చంపేదీన స్థితికి వచ్చాయా ప్రభుత్వాలు అని విమర్శలు వినిపిస్తున్నాయి. 

 
ఉల్లి కోసం జనం ఇంత బారులు తీరడం ఏంటి?  నానా కష్టాలు పడుతున్నారు. తొక్కిసలాటలూ జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో సాంబయ్య అనే వృద్ధుడు ఈ రోజు ఉదయం నుంచి క్యూలో నిల్చుని చివరకు సొమ్మసిల్లిల మరణించాడు. అతను ఉల్లి తినకపోయినా బతికేవాడు. ప్రభుత్వ స్కీముతో ఉల్లికోసం వచ్చి చనిపోయాడు అని సర్కారుపై జనం శాపనార్థాలు పెట్టారు.
దీనిపై తెలుగుదేశం నాయకుడు లోకేష్ తీవ్రంగా స్పందించారు. ’’ పేద ప్రజలపై జగన్ కు అంతకక్ష ఎందుకో? జగన్ అసమర్థ పాలన కారణంగా ఉల్లి కోసం సామాన్యులు అల్లాడుతున్నారని, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి’’ అంటూ మండిపడ్డారు లోకేష్.