భారీగా ఎర్రచందనం చోరీ..! వైసీపీ మంత్రి హస్తం?

September 24, 2020

ఆంధ్రప్రదేశ్ కి ఉన్న సహజ వనరులలో ఎర్ర చందనం కూడా ఒకటి. రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా ఉన్న ఈ కలప విషయంలో జరిగే స్మగ్లింగ్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంత మందిని అదుపులోకి తీసుకున్నా ఇది మాత్రం ఎక్కడా ఆగడం లేదు. గత ప్రభుత్వ హాయంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టటానికి జాగ్రత్తలు ఎక్కువే తీసుకుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన స్మగ్లర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న కొంత మందిని ఎంకౌంటర్ చేయటం కూడా అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. అక్రమ రవాణాకు గురి అవుతున్న కొన్ని వేల టన్నుల ఎర్రచందనాన్ని చెక్ పోస్టుల వద్ద పట్టుకుని ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ చేసింది.

ఇక ఇప్పుడు ప్రభుత్వ మారింది. ఇప్పుడు అదే ఎర్ర చందనం విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ప్రచారమే జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఎర్ర చందనం తరలిపోతున్న వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. గోడౌన్ల నుంచి ఎర్రచందనం భారీగా చోరీకి గురవుతుందని అంటున్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి. అసలు ఇప్పుడు ఈ చోరీల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైన…ఒక పాత నేరస్థుడి హస్తం దీనిలో ఉందని… ఆయనకు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేత సహకరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొందరు కీలక నేతలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఎర్ర చందనం విషయంలో కొందరు చూసి చూడనట్టు పోతున్నారని అంటున్నారు. ఎంతో విలువైన ఎర్రచందనం భారీగా చోరీకి గురవుతుందని, అడువుల్లో కూడా స్మగ్లింగ్ భారీ ఎత్తున జరుగుతుందని, చోరీకి గురైన దానిని ఏ ఇబ్బందులు లేకుండా పక్క రాష్ట్రాలకు తరలించుకునే విషయంలో కూడా అధికారులు సహకరిస్తున్నారని సమాచారం.

ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి గారు అయితే ఈ విషయంలో అక్రమార్కులకు చక్కగా సహకరిస్తూ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారట. మరి వీరి చేతివాటం ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. 

RELATED ARTICLES

  • No related artciles found