వాళ్లు జగన్ ని కూడా వదిలిపెట్టలేదు

September 22, 2020

అమరావతి ఉద్యమంలో విద్యావంతులు అధికంగా ఉండటంతో అమరావతి ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రచారం పొందుతోంది. అరెస్టు చేసిన అమరావతి మహిళా రైతులను సాయంత్రం 6 గంటల తర్వాత కూడా స్టేషన్లోనే ఉంచడంపై జగన్ నీకు సిగ్గులేదా అని లోకేష్ తీవ్రంగా ప్రశ్నించాడు. అయితే... వాళ్లు లోకేష్ ను పట్టించుకోకపోవచ్చేమో. కానీ మరో గంటలో ఢిల్లీ నుంచి జగన్ కు ఒక మెసేజ్ వచ్చింది. అంతే మహిళలు అందరినీ వదిలేశారు. ఇంతకీ ఆ మెసేజ్ ఎవరు పెట్టారంటే... ఢిల్లీ నుంచి రేఖా శర్మ పెట్టారు. ఆమె మహిళా కమిషన్ ఛైర్ పర్సన్. ట్విట్టరు లో ఆంధ్రప్రదేశ్ సీఎం హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ... అమరావతిలో 6 గంటల తర్వాత మహిళలను నిర్బంధించినట్లు మాకు చాలా మెసేజిలు వస్తున్నాయి. 

ఆమె ముఖ్యమంత్రిని ఎంత నేరుగా వాయించారంటే... గౌరవ సంబోధనను కూడా యాడ్ చేయలేదు. నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రీ... మీ పోలీసులకు చెప్పండి, వెంటనే అరెస్టు చేసి నిర్బంధించిన మహిళలను వదిలేయమని, 6 గంటల తర్వాత కూడా మహిళలను స్టేషన్లోనే ఉంచినట్టు నాకు వందలాది మెసేజ్ లు వస్తున్నాయి. వెంటనే వారిని వదిలిపెట్టండి అంటూ నేరుగా హెచ్చరించారు రేఖా శర్మ. రేపు మా బృందం వస్తుంది. రైతులను కలుస్తుంది. వాస్తవాలు వెలికి తీస్తుంది అంటూ ఆమె జగన్ ని వార్న్ చేశారు. 

ఒకవైపు తాను ఈరోజు చేసిన తప్పులకు కోర్టు బోనులో నిలబడుతూ ... ప్రపంచం తప్పొప్పుల గురించి, న్యాయాన్యాయాల గురించి జగన్ మాట్లాడుతున్నారు. ఇది ఏపీలో ఉన్న విచిత్రమైన పరిస్థితి.