రేణు దేశాయ్ తాజా సంచలన ఇంటర్వ్యూ !

September 23, 2020

రేణు దేశాయ్. మోడల్, నటి, నిర్మాత. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పాపులర్ అయ్యారు. పవన్ కల్యాణ్ తో పెళ్లి అనంతరం తెలుగు వారందరికి బాగా సుపరిచితం అయ్యారు. ఆ తర్వాత పవన్ ఆమె వేరు పడ్డారు. ప్రస్తుతం ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అనేక ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు.
పవన్ ఫ్యాన్స్ లో ఆమెను వ్యతిరేకించే వాళ్లు ఎక్కువ ఉన్నారు. చాలా సార్లు ఆమె వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేసమయంలో ఆమె ఆలోచనలకు మద్దతు పలికే వారు కూడా చాలామందే ఉన్నారు. ఏది ఏమైనా తనదైన జీవితాన్ని ఆనందంగానే గడుపుతున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు.