రోజా గురించి ఓ కొత్త పుకారు

September 21, 2020

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు కూడా చేయనున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇది దానికంటే ఆసక్తికరంగా ఉంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పటి ఎమ్మెల్యే అయిన రోజా వెండితెరకు దూరమైనా బుల్లితెరకు దూరం కాలేదు. అయితే ఆమె తిరిగి వెండితెరపై కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఆమె కమ్ బ్యాక్ ఒక సంచలనం అయితే, బాలకృష్ణ సినిమాతో ఆమె తిరిగి తెరంగేట్రం చేయనుండటం విశేషం అంటూ తెగ వైరల్ అవుతోంది ఒక వార్త. 

వాస్తవానికి దీనిని ఎవరూ దృవీకరించలేదు. కాబట్టి ఇంకా దీనిని పుకారు గానే చూడాలి. అయితే, ఎమ్మెల్యే అయిఉండి, ఒక కీలకమైన గవర్నమెంట్ పోస్టులో ఉండగా... రోజా తిరిగి నటనకు ప్రాధాన్యం ఇస్తారా ? అన్నది ఒక అనుమానం అయితే... అది కూడా రైవల్ అయిన  బాలకృష్ణ సినిమాలో, పైగా విలన్ పాత్ర అనడంతో కాస్త నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఇపుడు రాజకీయాలు, సినిమాలు, జీవితం వేరువేరుగా చూసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సినిమాలో బాలయ్య తో విలన్ గా చేస్తే అనవసరంగా ట్రోల్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఆమె ధృవీకరించని వార్త కాబట్టి దీనిమీద ఇంతకుమించి కామెంట్లు చేయలేం.

ఇదిలా ఉంటే... సీరియస్ పొలిటీషియన్ గా, ఎంపీగా పనిచేసి చాలా కాలం సినిమాలకు దూరమైన విజయశాంతి సినిమాలు చేయగా లేనిది తాను ఎందుకు సినిమాలు చేయకూడదు? అని ఆమె భావిస్తూ ఉండొచ్చు. విజయశాంతి ఇంకా హీరోయిన్ గా ఉండగానే రోజా సినిమాలు చేసింది. అంటే ఇద్దరు సమకాలికులు. అలా ఆలోచించి ఉండొచ్చు. మంచి రెమ్యునేషన్ ఆఫర్ చేసి ఉండొచ్చు. పైగా సినిమా ద్వారా వచ్చే డబ్బుకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 10-20 కోట్లు స్కాం చేస్తే గాని రాని డబ్బులు సినిమాలో నిజాయితీగా వస్తున్నపుడు నటించడంలో తప్పేముందని రోజా అనుకోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. 2016 నుంచి వెండితెరకు పూర్తి దూరమైన రోజా 2020లో మళ్లీ తెరమీద కనిపిస్తుందన్నమాట.