భోగి మంటల్లో చంద్రబాబు ఏం వేశాడంటే...

September 24, 2020

అమరావతిలో మొదలైన రాజధాని ఉద్యమం సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి రాష్ట్రంలో ఎంతగా రాజధాని గురించి చర్చ జరుగుతుందో అర్థమవుతోంది. రాజధాని మారుస్తామని రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లి గెలిస్తే నేను ఇక దానిపై మాట్లాడను, అసలు రాజకీయాలే వదిలేస్తాను అని చంద్రబాబు విసిరిన సవాల్ అందరికీ షాకిచ్చింది. రాజధాని వేడి అంతటా రగులున్న వేళ భోగి పండగను జరుపుకుంటూ నిరసన తెలిపింది అమరావతి పరిరక్షణ సమితి.

విజయవాడలోని బెంజ్ సర్కిల్లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్వంలో భోగి పండగ రూపంలో అమరావతి మార్పును నిరసిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి చంద్రబాబు హాజరయ్యారు. పలువురు ఇతర పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ నివేదికలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్తుందని... ఇపుడు కనుక అడ్డుకోకపోతే ఎప్పటికీ ఏపీ కోలుకోలేదని చంద్రబాబు హెచ్చరిించారు.