IPL: రీల్ సీన్ రియల్ గా జరిగితే...

September 23, 2020

ఐపీఎల్ లో ఎలాంటి భావోద్వేగ అంశం లేద‌ని చెప్పినా.. ఆ టోర్నీ మీద భార‌తీయులు ప్ర‌ద‌ర్శించే అభిమానం అంతా ఇంతా కాదు. దాదాపు నెల‌న్న‌ర పాటు ఐపీఎల్ సీజ‌న్ ను మ‌స్తు ఎంజాయ్ చేసేసిన వారంతా.. ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన తీరుతో మంచి ముగింపు ఇచ్చిన‌ట్లైంది. అయితే.. న‌రాలు తెగె ఉత్కంఠ తో చివ‌రి బంతికి అవుట్ అయిన తీరుపై చాలానే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చెన్నై ఇండియ‌న్స్ ఓట‌మికి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు అభిమానులు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ఒక్క ప‌రుగుతో ఓడిన‌ప్ప‌టికీ.. ఆ టీమ్ ఓపెన‌ర్ షేన్ వాట్స‌న్ జ‌ట్టును గెలిపించ‌టం కోసం అత‌గాడు ప‌డిన ఆత్రుత‌.. సాహ‌సం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చెన్నై జ‌ట్టు బౌల‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ తాజా ట్వీట్ తో వాట్సాన్ హీరోయిజం బ‌య‌ట‌కు వెల్ల‌డైంది.
సాధార‌ణంగా ఇలాంటివి సినిమాల్లో మాత్ర‌మే చూస్తాం. జ‌ట్టు కోసం గాయాన్ని లెక్క చేయ‌కుండా వీరోచిత పోరాటం చేసే వైనానికి మించి.. వాట్స‌న్ చేసిన సాహ‌సం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. సీరియ‌స్ గా మ్యాచ్ జ‌రుగుతున్న వేళ‌.. వేలాది ప్రేక్ష‌కులు కానీ.. కెమేరా క‌ళ్లు కాని క‌నిపెట్ట‌ని విష‌యాన్ని భ‌జ్జీ తాజాగా వెల్ల‌డించారు.
ఫీల్డింగ్ వేళ డ్రైవ్ చేసే క్ర‌మంలో వాట్స‌న్ మోకాలి వ‌ద్ద గాయ‌మైంది. అయితే.. ఆ విష‌యాన్ని ఎవ‌రికి చెప్ప‌కుండా బ్యాటింగ్ కు దిగిన అత‌డు వీరోచితంగా బ్యాటింగ్ చేశారు. అత‌ను బ్యాట్ చేసే స‌మ‌యంలో ఎడ‌మ మోకాలి వ‌ద్ద ర‌క్తం కారుతున్న ఫోటోల‌ను భ‌జ్జీ పోస్ట్ చేశారు. అత‌డి మోకాలి వ‌ద్ద కారుతున్న ర‌క్తాన్ని చూశారా? మ్యాచ్ త‌ర్వాత వాట్స‌న్ కు ఆరు కుట్లు పడ్డాయి. డ్రైవింగ్ చేసిన‌ప్పుడు గాయ‌మైనా.. ఎవ‌రికి చెప్ప‌కుండా బ్యాటింగ్ చేశాడ‌ని పేర్కొన్నారు. భ‌జ్జీ పోస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫైన‌ల్ మ్యాచ్ లో వాట్సాన్ 80 ప‌రుగులు చేశారు. గాయం ఇబ్బంది పెట్ట‌కుండా భారీ స్కోర్ చేసిన వాట్సాన్ వీరోచిత పోరాటానికి త‌గ్గ‌ట్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ గెలిచి ఉంటే మ‌రింత బాగుండేదేమో క‌దూ?