అగ్ర నిర్మాత మీద షాకింగ్ పోస్టు పెట్టిన శ్రీరెడ్డి

September 24, 2020

వాదాలతో సహవాసం చేసే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తరచూ ఎవరో ఒకరిపైన ఫైర్ అయ్యే ఈ అమ్మడు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మీదా నాగార్జున మీదా విమర్శల కత్తిని దూయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇండస్ట్రీలో అగ్రనిర్మాతగా పేరున్న ప్రముఖుడ్ని ఉద్దేశించి షాకింగ్ పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. గతంలోనూ ఇదే నిర్మాత కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ ఇష్యూలో రాంగోపాల్ వర్మసైతం ఎంటర్ కావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా సదరు అగ్ర నిర్మాతను ఉద్దేశిస్తూ.. ఈ మధ్యన మీరు హీరోయిన్ల డేట్లు చూడటం.. ప్రమోషన్ వర్క్ లాంటివి చేస్తున్నారట కదా? నా డేట్లు.. ప్రమోషన్ కూడా చూడొచ్చుగా అంటూ కోంటె వ్యాఖ్యలు చేసింది. ఇలా చేస్తే ఫర్లేదు కానీ.. మొదట్లోనే సదరు నిర్మాత పేరు పక్కన మామయ్య అంటూ పిలవటం సంచలనంగా మారింది. పోస్టు మొదట్లోనే కాదు.. చివర్లోనూ మరో మామయ్య సంబోధనతో పోస్టు పూర్తి చేసిన శ్రీరెడ్డి యవ్వారం ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.  

Read Also

పవన కళ్యాణ్ ని నలిపేశారు
వైసీపీ వర్సెస్ బీజేపీ.. రాజకీయం మారిపోతోంది
హ‌రీశ్‌రావు..ఇప్పుడు గుర్తుకు వ‌చ్చాడా కేసీఆర్ ?